IND vs NZ 2nd Test Yashaswi Jaiswal Record : న్యూజిలాండ్‌తో రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా యంగ్ ప్లేయర్ యశస్వి జైశ్వాల్ దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ఇప్పటికే ఒక క్యాలెండర్ ఇయర్‌లో టెస్టుల్లో 1000 పరుగులు సాధించిన యంగ్ ఇండియన్ క్రికెటర్‌గా రికార్డు సాధించిన అతడు మరో ఘనతను కూడా ఖాతాలో వేసుకున్నాడు.
టెస్టుల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో స్వదేశంలోనే వెయ్యికిపైగా పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలోనూ చోటు సంపాదించుకున్నాడు. భారత్ తరఫున మూడో బ్యాటర్‌గా నిలిచాడు. యశస్వి కన్నా ముందు గుండప్ప విశ్వనాథ్ (1979లో), సునీల్ గావస్కర్ (1979లో) మాత్రమే స్వదేశంలో 1000+కి పైగా పరుగులు సాధించిన టీమ్ ఇండియా బ్యాటర్లుగా నిలిచారు. మొత్తంగా ఇంగ్లాండ్ ప్లేయర్ గ్రాహమ్ గూచ్ (1990), ఆసీస్ బ్యాటర్ జస్టిన్ లాంగర్ (2004), పాక్ క్రికెటర్ మహమ్మద్ యూసఫ్ (2006), ఆసీస్ మాజీ కెప్టెన్ (2012) మాత్రమే తమ స్వదేశాల్లో ఈ 1000 పరుగుల మార్క్‌ను టచ్ చేశారు.
సెహ్వాగ్ రికార్డుపై కన్ను - టీమ్ ఇండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్, మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్ 1979లో సాధించిన రికార్డును బ్రేక్ చేశాడు. దిలీప్ 23 ఏళ్ల వయసులో 1000 పరుగుల మార్క్‌ను టచ్ చేయగా, ఇప్పుడు యశస్వి 22 ఏళ్లకే దీన్ని అందుకున్నాడు. ఇక 2024 ఏడాదిలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ప్లేయర్‌గానూ యశస్వి నిలిచాడు. 10 మ్యాచ్‌ల్లో 1053* పరుగులు సాధించాడు. అతడి కన్నా ముందు జో రూట్ (1,338) కొనసాగుతున్నాడు. అయితే, రూట్ 14 మ్యాచుల్లో చేశాడు.
ఇక ఇప్పుడు ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఏకైక భారత ఓపెనర్‌గా సెహ్వాగ్ (2008లో 1462 పరుగులు) రికార్డును యశస్వి బ్రేక్ చేసే అవకాశం ఉంది. న్యూజిలాండ్‌తో మూడో టెస్టుతో పాటు ఆస్ట్రేలియాతో ఈ ఏడాదే మరో నాలుగు టెస్టులను (బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో ఐదు టెస్టుల సిరీస్) టీమ్ ఇండియా ఆడనుంది. కాబట్టి జైశ్వాల్ సెహ్వాగ్ రికార్డ్‌ను అధిగమించొచ్చు.
తొలి ఇండియన్ బ్యాటర్‌గా 30 సిక్స్‌లు - అలానే టెస్టుల్లో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో 30 సిక్స్‌లు బాదిన తొలి ఇండియన్ బ్యాటర్‌గానూ రికార్డు సాధించాడు జైశ్వాల్.
భారత్ లక్ష్యం 359 - నాలుగో ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా భారీ ఛేజింగ్‌లు ఇవే
'అది చాలా కష్టమైంది!' : IPL 2025 ఆడటంపై క్లారిటీ ఇచ్చిన ధోనీ!