ETV Bharat / sports

మా బ్రదర్​ విషయంలో అలా చేయడం సరికాదు!: వాషింగ్టన్ సుందర్ సోదరి - WASHINGTON SUNDAR SISTER

న్యూజిలాండ్​తో జరుగుతోన్న రెండో టెస్ట్​లో అద్భుత ప్రదర్శన చేసిన వాషింగ్టన్ సుందర్​పై అతడి సోదరి కీలక కామెంట్స్​!

IND VS NZ 2nd Test Washington Sundar
IND VS NZ 2nd Test Washington Sundar (source Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Oct 25, 2024, 9:04 AM IST

IND VS NZ 2nd Test Washington Sundar : దాదాపు 45 నెలల తర్వాత టెస్టు జట్టులోకి ఎంట్రీ వచ్చిన వాషింగ్టన్ సుందర్ న్యూజిలాండ్​తో జరుగుతోన్న రెండో టెస్ట్​లో బంతితో విజృంభించాడు. కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. ఏడు వికెట్ల (7/59)తో అదరగొట్టాడు. దీంతో పునరాగమనంలో అద్భుత ప్రదర్శన చేయడంతో సుందర్​పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే సుందర్ శ్రమించిన తీరును, సంకల్పం గురించి సుందర్ సోదరి శైలజ ఓ ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడింది. గాయాలైనా కూడా సుందర్ జట్టుకు 100 శాతం అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాడని చెప్పింది. రవిచంద్రన్ అశ్విన్‌తో సుందర్​ను పోల్చవద్దని, అలా చేయడం వల్ల సుందర్‌ను ఒత్తిడిలోకి నెట్టినట్టు అవుతుందని పేర్కొంది.

Washington Sundar : "గతంలో క్రికెట్‌లో ఫిట్‌నెస్ అనేది అంత పెద్ద విషయం కాదు. కానీ ఈ రోజుల్లో ఎంతో ముఖ్యం. వాషింగ్టన్ సుందర్ ఎప్పుడూ ఓటమిని అంగీకరించడు. గాయపడినప్పుడు కూడా 100 శాతం ప్రయత్నిస్తూనే ఉంటాడు. అతడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఆటను మెరుగుపర్చుకోవడానికి ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తుంటాడు. అతడి కఠోర శ్రమ, సాధనే ఈ రోజు విజయం సాధించడానికి దోహదపడ్డాయి.

గతంలో సుందర్ ఓ సారి సెంచరీని మిస్ చేసినప్పుడు, స్టూడెంట్ ఓ మార్క్ మిస్ చేస్తే అడిగినట్లుగా మా తండ్రి సుందర్​ను సరదాగా ప్రశ్నించారు. అయితే ఇప్పుడు ఒకే ఇన్నింగ్స్‌లో సుందర్ ఏడు వికెట్ల ప్రదర్శన చేయడం చూసి మా కుటుంబం ఎంతో గర్వంగా సంతోషిస్తోంది. క్రికెట్​లో టెస్ట్​ ఓ స్వచ్ఛమైన ఫార్మాట్. ఆటగాడి నైపుణ్యాలు, ప్రదర్శనను పరీక్షిస్తుంటుంది.

అయితే లెజండరీ రవిచంద్రన్ అశ్విన్‌తో సుందర్‌ను పోల్చడం సరికాదు. ఎన్నో ఘనతలు సాధించిన లెజెండ్ అశ్విన్. కానీ సుందర్ ఇప్పుడు ఎదుగుతున్న ఆటగాడు. ఇద్దరిది భిన్నమైన శైలి. అశ్విన్‌తో పోలుస్తూ సుందర్‌ను ఒత్తిడిలోకి నెట్టకూడదు. అశ్విన్‌ స్థానంలో బాధ్యతలు అందుకోవడం చాలా పెద్ద భాధ్యత అశ్విన్ సాధించిన ఘనతలు అందుకోవాలంటే దేవుడి ఆశీస్సులు కావాలి." అని సుందర్ సోదరి శైలజ చెప్పింది.

'వాషింగ్టన్' సుందర్‌ - అసలీ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

పుణెలో సుందర్ మేజిక్- 1329 రోజుల తర్వాత కమ్​బ్యాక్ అదుర్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.