Ind Vs Eng Top 5 Test Moments: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌ను భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే గెలుచుకుంది. ఈ క్రమంలో భారత్ స్వదేశంలో చివరి 16 టెస్టు సిరీస్‌లను గెలుచుకొని జైత్రయాత్ర కొనసాగిస్తుంది. అయితే బజ్‌బాల్ వ్యూహాన్ని నమ్ముకొని భారత్ పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్పైటీమ్ఇండియా పూర్తి ఆధిపత్యం చలాయిస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుత సిరీస్‌లో రాజ్‌కోట్ టెస్టులో టీమ్ఇండియా 434 పరుగుల భారీ తేడాతో నెగ్గి సంచలనం సృష్టించింది. పరుగుల పరంగా టెస్టుల్లో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసి భారత్ రికార్డ్ కొట్టింది. అయితే గతంలోనూ సొంతగడ్డపై టీమ్ఇండియా ఇంగ్లాండ్‌ను చిత్తు చిత్తుగా ఓడించిన సందర్భాలు ఉన్నాయి. అందులో టాప్ మూమెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
1. మొహాలి (2001): తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 238 పరుగులకే ఆలౌటైంది. టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హర్భజన్ సింగ్ ఐదు వికెట్ల ప్రదర్శనతో మెరిశాడు. ఆ తర్వాత దీప్ దాస్‌గుప్తా (100), సచిన్ తెందూల్కర్ (88), రాహుల్ ద్రవిడ్ (86) రాణించడం వల్ల టీమ్ఇెండియా 231 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో అనిల్ కుంబ్లే బౌలింగ్‌తో మాయాజలం చేశాడు. ఏకంగా 6 వికెట్లు నేలకూల్చి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. ఫలితంగా రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 235 పరుగులకే ఆలౌటై భారత్‌కు కేవలం 5 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ అతి స్వల్ప లక్ష్యాన్ని ఛేదించిన భారత్ ఘన విజయాన్ని నమోదు చేసింది.
2. చెన్నై (2008): అప్పటి ఇంగ్లాండ్ కెప్టెన్ అతి విశ్వాసంతో రెండో ఇన్నింగ్స్‌ను 311-9 వద్ద డిక్లేర్డ్ చేశాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో 75 పరుగుల ఆధిక్యం సాధించిన ఇంగ్లాండ్ 387 రన్స్ టార్గెట్‌ను భారత్ ముందుంచింది. ఈ క్రమంలో టీమ్ఇండియా ధాటిగా ఆడింది. దిగ్గజ ప్లేయర్ సచిన్ తెందూల్కర్ (103 నాటౌట్) శతకానికి తోడు, వీరేంద్ర సెహ్వాగ్ (83), యువరాజ్ సింగ్ (85 నాటౌట్), గౌతమ్ గంభీర్ (66) సమష్టిగా రాణించి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
3. అహ్మదాబాద్ (2012): ఛెతేశ్వర్ పుజారా (206) డబుల్ సెంచరీకి తోడు వీరేంద్ర సెహ్వాగ్ (117), యువరాజ్ సింగ్ (74) భారీ ఇన్నింగ్స్‌తో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 521-8 వద్ద డిక్లేర్డ్ చేసింది. భారత్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా అద్భుత బౌలింగ్‌తో తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు దక్కించుకున్నాడు. ఫలితంగా ఇంగ్లాండ్ 191 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ ప్రత్యర్థిని ఫాలోఆన్‌లోకి నెట్టింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 406 పరుగులు చేసి, భారత్‌కు 77 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. ఈ స్వల్ప టార్గెట్‌ను టీమ్ఇండియా 1 వికెట్ కోల్పోయి ఛేదించింది.
4. చెన్నై (2016): తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 477 పరుగులు చేసి ఫుల్ కాన్ఫిడెన్స్‌గా ఉంది. అయితే కరుణ్ నాయర్ (303*) ట్రిపుల్ సెంచరీకి తోడు కేఎల్ రాహుల్ (199), పార్థివ్ పటేల్ (71), రవిచంద్రన్ అశ్విన్ (67), రవీంద్ర జడేజా (51) రాణించడం వల్ల భారత్ టెస్టు చరిత్రలో అత్యధిక స్కోర్ (759/7 d) నమోదు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో తేలిపోయిన ఇంగ్లాండ్ కేవలం 207 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ ఇన్నింగ్స్, 75 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది.
5. గుజరాత్(2024): రాజ్‌కోట్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో భారత్ 434 పరుగుల తేడాతో గెలిచి రికార్డు క్రియేట్ చేసింది. టెస్టు క్రికెట్ చరిత్రలోనే పరుగుల పరంగా భారత జట్టుకు ఇదే అత్యంత పెద్ద విజయం. అద్భుతమైన ఆటతీరుతో రోహిత్ శర్మ సేన ఈ గ్రాండ్ విక్టరీని తమ ఖాతాలో వేసుకుంది.