Ind vs Eng Test Yashasvi Gill Century: ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా యంగ్ బ్యాటర్లు యశస్వి జైశ్వాల్, శుభ్‌మన్ గిల్ శతకాలతో అదరగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో జైశ్వాల్ డబుల్ సెంచరీ (209)తో రప్ఫాడించగా, సెకండ్ ఇన్నింగ్స్‌లో గిల్ సెంచరీతో కదంతొక్కాడు. వీరిద్దరు కూడా టీమ్ఇండియా కష్టాల్లో ఉన్నప్పుడే జట్టును ఆదుకోవడం విశేషం. దీంతో ఈ యంగ్ టాలెండెట్ ప్లేయర్లపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా మాజీ ప్లేయర్లు వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ తెందూల్కర్ ఈ ఇద్దర్ని ప్రశంసించాడు.
'25 ఏళ్లు కూడా నిండని ఈ ఇద్దరు కుర్రాళ్లు జట్టుకు అవసరమైనప్పుడు బలంగా నిలబడ్డారు. వారి పెర్ఫార్మెన్స్ పట్ల చాలా సంతోషంగా ఉంది. రానున్న దశాబ్దంపాటు వీళ్లూ క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తారు' అని సెహ్వాగ్ అన్నాడు. మరోవైపు సచిన్ కూడా ఈ యంగ్ బ్యాటర్ల ప్రదర్శనపై ప్రశంసలు కురిపించాడు. 'వెల్ డన్ యశస్వి, విజయీభవ' అని డబుల్ సెంచరీ సాధించిన జైశ్వాల్‌ను ప్రశంసించాడు. తాజాగా గిల్ సెంచరీపై కూడా స్పందించాడు. 'పూర్తి నైపుణ్యాలతో శుభ్‌మన్ ఈ ఇన్నింగ్స్ ఆడాడు. సరైన సమయంలో సెంచరీ సాధించావు. కంగ్రాట్స్' అని ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ షేర్ చేశాడు.
-
Glad to se two youngsters, both under 25 rising to the ocassion and standing out.
— Virender Sehwag (@virendersehwag) February 4, 2024
Very likely that these two will dominate world cricket for the next decade and more. pic.twitter.com/fYzh8oOnaL
రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 255 పరుగులకు ఆలౌటైంది. 28-0 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమ్ఇండియా 227 పరుగులు జోడించి 10 వికెట్లు కోల్పోయింది. గిల్ (104 పరుగులు, 11x4, 2x6) ఒక్కడే సెంచరీ బాదాడు. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (45 పరుగులు) రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీతో అదరగొట్టిన యశస్వి ఈ ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోర్ (17)కే ఔటయ్యాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (13), శ్రేయస్ అయ్యర్ (29), రజత్ పటీదార్ (9), కే ఎస్ భరత్ (6) మరోసారి విఫలమయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో టామ్ హార్ట్లీ 4, రెహాన్ అహ్మద్ 3, జేమ్స్ అండర్సన్ 2, షోయబ్ బాషిర్ 1 వికెట్ దక్కించుకున్నారు. దీంతో భారత్ 398 పరుగుల ఆధిక్యంతో ఉంది. ఇంగ్లాండ్ విజయానికి 399 పరుగులు అవసరం.
బుమ్రా బౌలింగ్ దెబ్బ - బ్యాట్ కిందపడేసిన బెన్‌స్టోక్స్
రఫ్పాడించిన బుమ్రా- ఇంగ్లాండ్ 253 ఆలౌట్- 171 రన్స్ లీడ్‌లో భారత్