IND VS ENG Test Series 2024 KL Rahul : భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లోని చివరి మూడు మ్యాచ్‌లకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడతడు త్వరలో ధర్మశాలలో జరిగే ఆఖరి మ్యాచ్‌కు కూడా దూరమయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. తొలి మ్యాచు మొదటి ఇన్నింగ్స్‌లో మంచిగా ఆడిన రాహుల్ రెండో ఇన్నింగ్స్‌లో నిరాశపరిచాడు. మొత్తంగా హైదరాబాద్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 108 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచులోనే తొడకండరాలు పట్టేయడంతో జట్టుకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందిన రాహుల్ పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించకపోవడంతో మిగిలిన మూడు టెస్టులకు కూడా అందుబాటులోకి రాలేదు. అయితే ధర్మశాల వేదికగా జరగనున్న ఆఖరి మ్యాచులోనైనా రాహుల్ మైదానంలోకి అడుగుపెడతాడని అంతా భావించినప్పటికీ గాయం మళ్లీ తిరగబెట్టినట్లు తెలుస్తోంది.
ఇదే విషయంపై బీసీసీఐ వర్గాలు స్పందించాయి. గత మూడు టెస్టులకు రాహుల్ అందుబాటులో ఉంటాడు అనుకున్నాం. కానీ తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నట్లు రాహుల్ తెలిపాడు. వరల్డ్ కప్ 2023 సౌత్ ఆఫ్రికా టెస్టు సిరీస్‌లో వికెట్ కీపింగ్ కారణంగా రాహుల్‌పై ఎక్కువ భారం పడింది. తొడకండరాల నొప్పితో అతడు బాధపడుతున్నాడు. తాజాగా రాహుల్ మెడికల్ రిపోర్టును ఇంగ్లాండ్‌లో అతడికి చికిత్స ఇచ్చిన వైద్యులకు పంపించారు. రాహుల్‌ను మరోసారి ఇంగ్లాండ్‌కు రావాలని వైద్యులు చెప్పారు. అతడిని నేరుగా పరీక్షించిన తర్వాతే అసలు సమస్య ఏంటో తెలుసుకోవచ్చని వైద్యులు అన్నారు అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
కాగా, టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని రాహుల్ త్వరగా కోలుకునేందుకు అతడికి మరింత సమయం ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రాంచీలో జరిగిన నాలుగవ టెస్టులో భారత్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ తిరుగులేని 3-1 ఆధిక్యాన్ని సంపాదించింది.
మరో కోహ్లీ కావాల్సిందే - నాలుగో స్థానం కోసం టీమ్ఇండియా తిప్పలు!