ETV Bharat / sports

జడ్డూ దెబ్బకు ఇంగ్లాండ్ హడల్​ - 353 పరుగులకు ఆలౌట్‌ - ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ స్కోర్

Ind Vs Eng 4th Test : టీమ్‌ఇండియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టు 353 పరుగులకు ఆలౌట్‌ అయింది.

Ind Vs Eng 4th Test
Ind Vs Eng 4th Test
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 24, 2024, 11:06 AM IST

Updated : Feb 24, 2024, 12:35 PM IST

Ind Vs Eng 4th Test : రాంచీ వేదికగా టీమ్‌ఇండియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టు 353 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఓవర్‌నైట్‌ 302/7తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లీష్ జట్టును కట్టడి చేసిన రోహిత్ సేన వరుస వికెట్లతో చెలరేగిపోయింది. ఆల్‌రౌండర్‌ జడేజా దెబ్బకు ఇంగ్లీష్ జట్టు డీలా పడిపోయింది. దీంతో ఓవర్​నైట్​ స్కోర్​కు మరో 51 పరుగులు జోడించిన ఇంగ్లీష్​ ప్లేయర్లు పెవిలియన్​ బాట పట్టారు.

అర్ధశతకం సాధించిన రాబిన్సన్‌(58) టెస్టుల్లో తొలి అర్ధ శతకం సాధించాడు. అయితే అనూహ్యంగా జడేజా చేతికి చిక్కాడు. ఆ తర్వాత షోయబ్‌ బషీర్​ను కూడా అదే ఓవర్‌లో జడ్డూ పెవిలియన్ బాట పట్టించాడు. ఆ తర్వాత వచ్చిన జేమ్స్‌ అండర్సన్‌ కూడా జడేజా బౌలింగ్‌లోనే ఎల్బీగా వెనుదిరిగాడు. ఇక ఆఖరి వరకు పోరాడిన జో రూట్‌ శతకంతో(122) నాటౌట్‌గా నిలిచాడు. రూట్‌-రాబిన్సన్‌ కలిసి ఎనిమిదో వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. మరోవైపు భారత బౌలర్లలో జడేజా 4, ఆకాశ్‌దీప్‌ 3, సిరాజ్‌ 2, అశ్విన్ 1 వికెట్ తీశారు.

టెస్టుల్లో రూట్ రికార్డ్ : శుక్రవారం జరిగిన మ్యాచ్​లో సెంచరీ బాదాడు జో రూట్. 219 బంతులు ఆడి అతడు సెంచరీ మార్క్ అందుకున్నాడు. కాగా, టెస్టుల్లో రూట్​కు ఇది 31వ శతకం. అయితే దీంతో పాటు ఈ స్టార్ క్రికెటర్ ఇదే వేదికగా ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో భారత్​పై 10 సెంచరీలు బాదిన ఏకైక బ్యాటర్​గా చరిత్రకెక్కాడు. ఇక ఈ జాబితాలో జో రూట్ తర్వాత ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ (9), వివ్ విచర్డ్స్ (8), రికీ పాంటింగ్ (8) ఉన్నారు. అయితే అన్ని ఫార్మాట్​లలో కలిపి రూట్​కు భారత్​పై ఇది 13వ శతకం. ఈ విషయంలో రూట్ కంటే ముందు స్టీవ్ స్మిత్, రికీ పాంటింగ్ చెరో 14 శతకాలతో ముందున్నారు.

ఆకాశ్ అదుర్స్- రూట్ సెంచరీ- తొలి రోజు ఇంగ్లాండ్ ఇలా

అరంగేట్రంలోనే అదరగొట్టేస్తున్న కుర్రాళ్లు - ప్రత్యర్థి జట్టు ఢమాల్​!

Last Updated : Feb 24, 2024, 12:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.