Ind vs Eng 3rd Test Records: సొంతగడ్డపై భారత్ చరిత్ర సృష్టించింది. రాజ్‌కోట్‌లో చెలరేగిన టీమ్ఇండియా టెస్టుల్లో అతిపెద్ద (పరుగుల పరంగా) విజయాన్ని నమోదు చేసింది. మూడో టెస్టులో భారత్ 434 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను చిత్తు చిత్తుగా ఓడించి జయకేతనం ఎగురవేసింది. 'బాజ్‌బాల్' వ్యూహాన్ని నమ్ముకున్న ఇంగ్లాండ్ టెస్టుల్లో రెండో అతిపెద్ద ఘోర పరాజయాన్ని చవి చూసింది. మరి ఈ మ్యాచ్‌లో నమోదైన పలు రికార్డులపై ఓ లుక్కేయండి.
- ఓ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ భారత్ 400+ స్కోర్లు నమోదు చేయడం ఇది మూడోసారి. ఇదివరకు (407 & 407/9 vs పాకిస్థాన్, 2005), (426 & 412/4 vs అహ్మదాబాద్ 2009) రెండుసార్లు నమోదు చేసింది.
- పరుగుల పరంగా భారత్ (434)కు ఇదే అతిపెద్ద విక్టరీ. ఇదివరకు 2021లో న్యూజిలాండ్‌పై 372 పరుగుల విజయమే టాప్‌లో ఉండేది.
- టీమ్ఇండియా సిక్స్‌ల పరంగానూ పలు రికార్డు కొట్టింది. ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన జట్టుగా టీమ్ఇండియా నిలిచింది. ఈ సిరీస్‌లో ఇప్పటిదాకా భారత్ ప్లేయర్లు 48 సిక్స్‌లు బాదారు. ఈ మ్యాచ్‌లోనే భారత్ 28 సిక్స్‌లు బాదింది.
- ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బ్యాటింగ్‌లో సెంచరీ బాది, బౌలింగ్‌లో 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. ఇలా టెస్టుల్లో టీమ్ఇండియా నుంచి సెంచరీ+ 5 వికెట్ల ప్రదర్శన చేయడం ఏడోసారి. ఇందులో అశ్విన్ మూడుసార్లు ఈ ప్రదర్శన చేయగా, జడ్డూ రెండుసార్లు, వినూ మన్కడ్, పాలీ ఉమ్రిగర్ ఒక్కోసారి ఈ ఫీట్ సాధించారు.
WTC Points Table 2025: ఈ విజయంతో డబ్ల్యూటీసీ 2023-25 పాయింట్ల పట్టికలో భారత్ మళ్లీ టాప్- 2కు చేరుకుంది. ఇదే సిరీస్‌లో తొలి మ్యాచ్ ఓటమి తర్వాత మూడో స్థానానికి పడిపోయిన భారత్ తాజాగా 59.52 పాయింట్లతో రెండో స్థానానికి దూసుకెళ్లింది. 75.00 పాయింట్లతో న్యూజిలాండ్ టాప్ ప్లేస్‌లో ఉండగా, 55.00 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడో పొజిషన్లో కొనసాగుతోంది. కాగా, 2025 మార్చి నాటికి టాప్- 2లో ఉన్న జట్లు ఫైనల్ పోరులో తలపడతాయి.
యశస్వి డబుల్ సెంచరీ: రైనాను గుర్తుచేసిన సర్ఫరాజ్- వీడియో వైరల్
రాజ్‌కోట్‌లో భారత్ గ్రాండ్ విక్టరీ- 434 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ చిత్తు