Ind vs Eng 1st Test 2024: ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 436 పరుగులకు ఆలౌటైంది. ప్రస్తుతం భారత్ 190 పరుగుల లీడ్‌లో ఉంది. ఓవర్‌నైట్ స్కోర్ 421-7తో మూడో ఆట బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ఇండియా మరో 15 పరుగులే జోడించి మూడు వికెట్లు కోల్పోయింది. జడేజా (87 పరుగులు), అక్షర్ పటేల్ (44 పరుగులు) చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జో రూట్ 4, టామ్ హార్ట్లీ 2, రెహన్ అహ్మద్ 2, జాక్ లీచ్ 1 వికెట్ దక్కించుకున్నారు.
భారత్ తొలి ఇన్నింగ్స్‌లో యంగ్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (80), రవీంద్ర జడేజా (87 పరుగులు), కేఎల్ రాహుల్ (86 పరుగులు) హాఫ్ సెంచరీలతో మెరవగా, శ్రీకర్ భరత్ (41 పరుగులు), అక్షర్ పటేల్ (44 పరుగులు), శ్రేయస్ అయ్యర్ (35) రాణించారు. తొలి రోజు జైశ్వాల్ ఆకట్టుకోగా, రెండో రోజు రాహుల్, జడేజా అద్భుతంగా ఆడారు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ (24 పరుగులు), యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ (23 పరుగులు), రవిచంద్రన్ అశ్విన్ (1) విఫలమయ్యారు. చివర్లో బుమ్రా (0) డకౌట్‌గా పెవిలియన్ చేరాడు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొలి రోజే 246 పరుగులకు ఆలౌటైంది. భారత స్పిన్నర్లు అశ్విన్, జడేజా, అక్షర్ దెబ్బకు ఇంగ్లాండ్ విలవిల్లాడింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ (70 పరుగులు) ఒక్కడే హాఫ్ సెంచరీ సాధించాడు. బెన్ డకెట్ (35 పరుగులు), బెయిర్ స్టో (37 పరుగులు) ఫర్వాలేదనిపించారు. జాక్ క్రాలీ (20 పరుగులు), ఒలీ పోప్ (1), జో రూట్ (29 పరుగులు), ఫోక్స్ (4 పరుగులు) విఫలమయ్యారు. ఇక టీమ్ఇండియా బౌలర్లలో జడేజా, అశ్విన్ చెరో మూడు, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా తలో రెండు వికెట్లు దక్కించుకున్నారు. పదిలో ఎనిమిది వికెట్లు స్పిన్నర్లకే దక్కడం విశేషం.
-
Innings Break!#TeamIndia post 436 on the board, securing a 1⃣9⃣0⃣-run lead.
— BCCI (@BCCI) January 27, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
8⃣7⃣ for @imjadeja
8⃣6⃣ for @klrahul
8⃣0⃣ for @ybj_19
Scorecard ▶️ https://t.co/HGTxXf8b1E#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/cVzCnmMF5h
">Innings Break!#TeamIndia post 436 on the board, securing a 1⃣9⃣0⃣-run lead.
— BCCI (@BCCI) January 27, 2024
8⃣7⃣ for @imjadeja
8⃣6⃣ for @klrahul
8⃣0⃣ for @ybj_19
Scorecard ▶️ https://t.co/HGTxXf8b1E#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/cVzCnmMF5hInnings Break!#TeamIndia post 436 on the board, securing a 1⃣9⃣0⃣-run lead.
— BCCI (@BCCI) January 27, 2024
8⃣7⃣ for @imjadeja
8⃣6⃣ for @klrahul
8⃣0⃣ for @ybj_19
Scorecard ▶️ https://t.co/HGTxXf8b1E#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/cVzCnmMF5h
- ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్: 246-10 (121 ఓవర్లు)
- భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్: 436-10 (64.3 ఓవర్లు)
ఉప్పల్‌లో తిప్పేస్తున్న భారత స్పిన్నర్లు- రోహిత్, సిరాజ్ సూపర్ క్యాచ్