IND vs BAN Test 2024 : భారత్ - బంగ్లాదేశ్ తొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సరికి టీమ్ఇండియా 308 పరుగుల లీడ్‌లో కొనసాగుతోంది. ప్రస్తుతం భారత్ ఇన్నింగ్స్‌లో 81-3 స్కోర్‌తో ఉంది. తొలి ఇన్నింగ్స్ ముగిసే సరికి 227 పరుగుల ఆధిక్యంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ఇండియా 3 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ (5 పరుగులు), విరాట్ కోహ్లీ (17 పరుగులు) మరోసారి నిరాశ పర్చారు. ఇక ఓపెనర్ యశస్వి జైస్వాల్ (10) కూడా తక్కువ స్కోర్‌కే పెవిలియన్ చేరాడు. క్రీజులో శుభ్‌మన్ గిల్ (33), రిషభ్ పంత్ (12) ఉన్నారు.
కాగా, తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 149 స్కోర్ వద్ద ఆలౌటైంది. చెపాక్ పిచ్‌పై భారత బౌలర్లు చెలరేగిపోయారు. షకిబ్ అల్ హసన్ (32 పరుగులు) టాప్ స్కోరర్. మిరాజ్ (27 పరుగులు), లిట్టన్ దాస్ (22 పరుగులు), నజ్ముల్ షాంటో (20 పరుగులు) విఫలమవగా, మిగతా బ్యాటర్లు కూడా చేతులెత్తేశారు. ఇక భారత బౌలర్లలో బుమ్రా 4, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, రవీంద్ర జడేజా తలో 2 వికెట్లు పడగొట్టారు. దీంతో టీమ్ఇండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 227 పరుగుల ఆధిక్యం లభించింది.
అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా ఓవర్‌నైట్ స్కోర్ 339-6 తో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమ్ఇండియా మరో 37 పరుగులకే చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది. రవిచంద్రన్ అశ్విన్ (113 పరుగుల), రవీంద్ర జడేజా (86 పరుగులు)తో ఆకట్టుకున్నారు.
Stumps on Day 2 in Chennai!#TeamIndia move to 81/3 in the 2nd innings, lead by 308 runs 👌👌
— BCCI (@BCCI) September 20, 2024
See you tomorrow for Day 3 action 👋
Scorecard - https://t.co/jV4wK7BOKA#INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/EmHtqyg9W3
Bumrah 400 Wickets : ఈ టెస్టులో టీమ్ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన మైలురాయి అందుకున్నాడు. బుమ్రా అన్ని అంతర్జాతీయ ఫార్మాట్లలో కలిపి 400 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 36.5వ ఓవర్ వద్ద హసన్ అహ్మద్ వికెట్‌తో బుమ్రా ఈ ఫీట్ అందుకున్నాడు. కాగా, ఈ ఫీట్ సాధించిన 6వ టీమ్ఇండియా పేసర్‌గా నిలిచాడు. ఈ లిస్ట్‌లో దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ 687 వికెట్లతో టాప్‌లో ఉన్నాడు. ఇక ఓవరాల్‌గా భారత్ నుంచి 400+ వికెట్లు తీసిన 10వ బౌలర్‌గానూ బుమ్రా నిలిచాడు.
విరాట్ ఖాతాలో మరో ఘనత - కోహ్లీ కంటే ముందు సచిన్ ఒక్కడే! - Ind vs Ban Test Series 2024
బుమ్రా @ 400 వికెట్లు - అరుదైన ఫీట్ అందుకున్న స్టార్ బౌలర్ - Ind vs Ban Test Series 2024