Ind vs Aus U -19 World Cup : సీనియర్ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిని ఇంకా భారత క్రికెట్ అభిమానులు మర్చిపోనేలేదు అంతలోనే జూనియర్ వరల్డ్ కప్‌లోనూ మనోళ్లను పరాజయం పలకరించేసింది. సీనియర్ టీమ్‌ను ఓడించిన ఆస్ట్రేలియానే ఇప్పుడు జూనియర్ జట్టుకు కూడా పరాజయం రుచిని చూపించింది. అండర్ - 19 వరల్జ్ కప్ 2024 ఫైనల్లోనూ భారత్‌ను దెబ్బతీసి నాలుగోసారి ట్రోఫీని ఎత్తుకెళ్లింది ఆసీస్. దీంతో ఈ ప్రపంచ కప్‌లో సీనియర్లకు ఎదురైన ఓటమిపై కుర్రాళ్లు ప్రతీకారం తీర్చుకుంటారని అంతా ఆశించారు. కానీ ఇప్పుడు కూడా ఓటమి ఎదురవ్వడంతో నిరాశే ఎదురైంది.
అయితే ఈ వరల్డ్ కప్ ఫైనల్లో టీమ్ ఇండియా ఓటమికి ప్రధాన కారణం హర్జాస్ సింగ్(U -19 World Cup Harjas singh). బ్యాటింగ్‌లో హాఫ్ సెంచరీతో మెరుగైన స్కోరును అందించిన అతడు భారత సంతతికి చెందినవాడే. అవును. అతని మూలాలు పంజాబ్‌లోని చండీగఢ్‌లో ఉన్నాయి. హర్జాస్ తండ్రి ఇందర్‌జిత్ సింగ్ రాష్ట్ర బాక్సింగ్ ఛాంపియన్ అని తెలిసింది. తల్లి అవిందర్ కౌర్ కూడా రాష్ట్ర స్థాయి లాంగ్ జంప్ అథ్లెట్ కావడం విశేషం.
అయితే 2000లో ఇందర్‌జిత్ ఫ్యామిలీ ఆస్ట్రేలియాకు వలస వెళ్లింది. 2005 సిడ్నీలో హర్జాస్ జన్మించాడు. రెవెస్బీ వర్కర్స్ క్రికెట్ క్లబ్‌లో 8 ఏళ్ల వయసులో అతడు కెరీర్‌ను మొదలుపెట్టాడు. కానీ ఈ వరల్డ్ కప్ ఫైనల్ ముందు వరకూ అతడు పెద్దగా రాణించింది ఏమీ లేదు. ఈ మ్యాచ్‌కు ముందు అతడి అత్యధిక స్కోరు కూడా 17 పరుగులు మాత్రమే. ఆరు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 49 పరుగులే ఖాతాలో వేసుకున్నాడు. కానీ ప్రస్తుతం ఈ కీలకమైన పోరులో మాత్రం 55 పరుగుల ఇన్నింగ్స్‌తో టీమ్ ఇండియాను గట్టిగా దెబ్బకొట్టాడు. సాధారణంగా ఎడమ చేతి వాటం బ్యాటర్ అయిన హర్జాస్ సింగ్ కుడి చేతి వాటం పేసర్ కూడా. లంక జట్టుపై ఓ వికెట్ కూడా పడగొట్టాడు. ఇప్పటికీ అతడి బంధువులు పంజాబ్‌లో నివసిస్తున్నారు. చివరగా అతడు ఓ సారి 2015లో భారత్‌ను సందర్శించి వెళ్లాడు.
ప్రపంచ క్రికెట్‌పై ఆస్ట్రేలియా ఆధిపత్యం
8 నెలల్లో మూడుసార్లు - భారత క్రికెట్ అభిమానులకు బాధ మిగిల్చిన ఆసీస్