IND VS AUS 3rd Test Live Updates : బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా కీలకమైన మూడో టెస్టులో టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకుంది భారత్.
ఇరు జట్లు ఇవే
- భారత్ : యశస్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్‌రెడ్డి, జస్ప్రిత్ బుమ్రా, సిరాజ్, ఆకాశ్ దీప్
- ఆస్ట్రేలియా : ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, లబుషేన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ గ్యారీ, కమిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లయాన్, హేజిల్‌వుడ్
రెండో టెస్ట్‌లో ఓటమి కారణంగా గబ్బా టెస్ట్‌లో తుది జట్టులో టీమ్ ఇండియా రెండు మార్పులు చేసింది. అశ్విన్‌కు బదులుగా జట్టులోకి మరో సీనియర్ స్పిన్నర్ జడేజా వచ్చాడు. హర్షిత్‌రాణాను పక్కనపెట్టి ఆకాశ్‌దీప్‌కు అవకాశం ఇచ్చారు. ఇక నితీశ్ రెడ్డిని జట్టు నుంచి తప్పించే అవకాశం ఉందని ప్రచారం సాగింది కానీ, గత రెండు టెస్టుల్లోనూ అతడు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో రాణించడంతో సెలెక్టర్లు అతడికి మరో ఛాన్స్ ఇచ్చారు.
అందుకే వారిద్దరినీ తప్పించాం - "మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. కాస్త ఓవర్‌కాస్ట్ కండిషన్స్ ఉండటంతో పాటు పిచ్‌పై గ్రాస్ కూడా ఉంది. దీనిని ఉపయోగించు కోవాలనుకుంటున్నాం. ఈ మ్యాచ్ మాకు చాలా కీలకం. విజయవకాశాలను అందిపుచ్చుకోవాలి. గత మ్యాచ్‌లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాం. అందుకే ఓడిపోయాం. ఈ మ్యాచ్ కోసం కుర్రాళ్లంతా సిద్దంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఆడుదామా? అనే ఉత్సాహంతో ఉన్నారు. మ్యాచ్ సాగుతున్నా కొద్దీ ఈ వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తోంది. తుది జట్టులో మేం రెండు మార్పులు చేశాం. అశ్విన్, హర్షిత్ రాణా స్థానాల్లో రవీంద్ర జడేజా, ఆకాశ్ దీప్ జట్టులోకి వచ్చారు. టీమ్ కాంబినేషన్‌లో భాగంగానే ఈ మార్పులు చేశాం." అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
వర్షం అంతరాయం
- చినుకులు పడటంతో మళ్లీ మ్యాచ్‌ను ఆపేసిన అంపైర్లు
- నిలకడగా ఆడుతూ పరుగులు చేసిన ఆసీస్ ఓపెనర్లు
- వికెట్ కోసం బుమ్రా, సిరాజ్ ప్రయత్నాలు
- క్రీజ్‌లో ఉస్మాన్ ఖవాజా , మెక్‌స్వీనీ ఉన్నారు.
- ప్రస్తుతం ఆసీస్ స్కోరు 28/0 (13.2 ఓవర్లు)
షమీ, ఆస్ట్రేలియా వెళ్లడం కష్టమే? - ఇక ఆ రెండు టోర్నీలే లక్ష్యం!