ICC Test Rankings 2024: టీమ్ఇండియా యంగ్ ప్లేయర్ యశస్వీ జైశ్వాల్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ (ICC Test Rankings Batting)లో తొలిసారి టాప్- 10లోకి దూసుకొచ్చాడు. ఐసీసీ బుధవారం రిలీజ్ చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో జైశ్వాల్ రెండు స్థానాలు మెరుగుపర్చుకొని 727 రేటింగ్స్‌తో 10వ ప్లేస్ దక్కించుకున్నాడు. టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (744 రేటింగ్స్) ఎనిమిదో స్థానం, కెప్టెన్ రోహిత్ శర్మ (720 రేటింగ్స్) రెండు స్థానాలు మెరుగుపర్చుకొని 11వ ర్యాంక్‌లో కొనసాగుతున్నారు. ఇక న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ 870 రేటింగ్స్‌తో అగ్రస్థానంలో ఉన్నాడు.
టాప్- 5లో ఉన్న బ్యాటర్లు
- కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్) - 870 రేటింగ్స్
- జో రూట్ (ఇంగ్లాండ్)- 799 రేటింగ్స్
- స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)- 789 రేటింగ్స్
- డారిల్ మిచెల్ (న్యూజిలాండ్) - 771 రేటింగ్స్
- బాబర్ ఆజమ్ (పాకిస్థాన్)- 768 రేటింగ్స్
ఒక్క మ్యాచ్ ఆడకపోయినా: ఈ ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓ స్థానం మెరుగుపర్చుకున్నాడు. అయితే ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో విరాట్ ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయినప్పటికీ విరాట్ ఓ స్థానం మెరుగయ్యాడు. మరోవైపు యాక్సిడెంట్ కారణంగా దాదాపు 16 నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్న యంగ్ బ్యాటర్ రిషభ్ పంత్ (699 రేటింగ్స్)14వ స్థానంలో ఉన్నాడు.
Test Bowling Rankings: బౌలింగ్ విభాగంలో టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 867 రేటింగ్స్‌లో అగ్రస్థానాన్ని పదిలంగా ఉంచుకున్నాడు. రెండో ప్లేస్‌లో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (846 రేటింగ్స్) కొనసాగుతున్నాడు. సౌతాఫ్రికా పేసర్ కగిసొ రబాడా (834 రేటింగ్స్) మూడో ప్లేస్‌లో ఉండగా, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ (822 రేటింగ్స్) నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక టీమ్ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 785 రేటింగ్స్‌తో ఈ లిస్ట్‌లో ఏడో ప్లేస్‌లో ఉన్నాడు.
ICC February Naominations: ఐసీసీ బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్‌కు టీమ్ఇండియా నుంచి యశస్వి ఎంపికయ్యాడు. యశస్వితోపాటు శ్రీలంక ప్లేయర్ పాథుమ్ నిస్సంకా, కివీస్ ఆటగాడు కేన్ విలియమ్సన్ కూడా ఎంపికయ్యారు.
టాప్ పొజిషన్‌కు గిల్ - కెరీర్లో అత్యుత్తమం, ఐసీసీ ర్యాంకింగ్స్ రిలీజ్