ETV Bharat / sports

టీమ్ఇండియా జట్టు ప్రకటించిన బీసీసీఐ - పంత్ ఇన్,​ రాహుల్ ఔట్​ - ICC T20 World Cup 2024 - ICC T20 WORLD CUP 2024

ICC T20 World Cup 2024 Team India : మరి కొద్ది రోజుల్లో జరగనున్న ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచ కప్​ కోసం ఆడనున్న టీమ్ఇండియా ప్లేయర్లను తాజాగా బీసీసీఐ అనౌన్స్ చేసింది. జట్టులో ఎవరెవరు ఉన్నారంటే?

WORLD CUP SELECTION
WORLD CUP SELECTION
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 30, 2024, 3:54 PM IST

Updated : Apr 30, 2024, 4:32 PM IST

ICC T20 World Cup 2024 Team India : యూఎస్, వెస్టిండీస్​ వేదికగా మరి కొద్ది రోజుల్లో జరగనున్న ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచ కప్​ కోసం ఆడనున్న టీమ్ఇండియా ప్లేయర్లను అనౌన్స్​ చేసింది బీసీసీఐ. రోహిత్ శర్మ నాయకత్వంలో జరగనున్న ఈ మెగా టోర్నీ కోసం తాజాగా ప్లేయింగ్​ 11ను వెల్లడించింది. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన సెలక్షన్‌ కమిటీ మీటింగ్​లో కెప్టెన్ రోహిత్ శర్మ, అలాగే కమిటీ ఛైర్మన్‌ అజిత్‌ అగార్కర్‌ ప్లేయర్ల పేర్లను తెలిపారు.

రోహిత్ కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు. వైస్​ కెప్టెన్​గా హార్దిక్ పాండ్య ఎంపికయ్యాడు. రిషభ్ పంత్​, సంజు శాంసన్, యుజువేంద్ర చాహల్, శుభమన్ గిల్​ కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు. అయితే కేఎల్ రాహుల్​కు మాత్రం చోటు దక్కలేదు. కాగా, ఈ సారి ప్రపంచకప్​ యూఎస్​, వెస్టిండీస్ వేదికగా జరగనున్నాయి. భారత్ తన తొలి మ్యాచ్​ను జూన్​ 5వ ఐర్లాండ్​తో ఆడనుంది.

ఇకపోతే ఈ మెగాటోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికాతో కెనడా తలపడనుంది. గ్రూప్‌ ఏలో ఉన్న భారత్‌-పాక్‌ జట్లు న్యూయార్క్‌ వేదికగా జూన్‌ 9న తలపడనున్నాయి. మొత్తంగా ఈ ప్రపంచకప్​ సిరీస్‌లో మొత్తం 20 జట్లు పోటీపడనున్నాయి. అమెరికాలో 3, వెస్టిండీస్‌లో 6 వేదికల్లో మొత్తం 55 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఫైనల్‌ మ్యాచ్‌ జూన్‌ 29న నిర్వహించనున్నారు.

టీమ్‌ ఇండియా పూర్తి జట్టు ఇదే : రోహిత్ శర్మ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్‌ పంత్, శాంసన్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చాహల్, అర్ష్‌దీప్‌ సింగ్, బుమ్రా, సిరాజ్.

ట్రావెలింగ్ రిజర్వ్‌ : శుభ్‌మన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్‌, అవేశ్‌ఖాన్‌

జట్టులో మార్పులు ఇంకా ఉంటాయా? - జూన్ 25 వరకు తమ జట్టులో మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకోసం ICC నుంచి ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాలి. ప్లేయర్ ఎవరైనా గాయపడినప్పుడు ఈ మార్పు జరుగుతుంది. ఈ నియమం టోర్నమెంట్‌లోని ప్రతి జట్టుకు వర్తిస్తుంది.

గ్రూప్ దశలో టీమ్ ఇండియా షెడ్యూల్

  • జూన్ 5 - టీమ్ ఇండియా వర్సెస్​ ఐర్లాండ్.
  • జూన్ 9 - టీమ్ ఇండియా వర్సెస్​ పాకిస్థాన్.
  • జూన్ 12 - టీమ్​ ఇండియా వర్సెస్ అమెరికా.
  • జూన్ 15 - టీమ్ ఇండియా వర్సెస్​ కెనడా.

యంగ్ రోహిత్​ను చూశారా? - వైరల్​గా మారిన హిట్​మ్యాన్ టీనేజ్ ఫొటో - Rohith Sharma Teen age photo

వన్డేల్లో హిట్​మ్యాన్ వరల్డ్​ రికార్డ్ - పదేళ్లైనా ఇంకా చెరగలేదు - Rohit Sharma Birthday

Last Updated : Apr 30, 2024, 4:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.