ETV Bharat / sports

బౌలింగ్, బ్యాటింగ్​లో పాక్ ప్లేయర్లదే హవా - సూర్య డౌన్​, కోహ్లీ, రోహిత్ స్థానం ఎంతంటే?

ఐసీసీ వన్డే, టీ20 ర్యాంకింగ్స్ విడుదల - విరాట్, రోహిత్​ను అధిగమించిన బాబర్ - ఫస్ట్ ప్లేస్​లో ఎవరంటే?

ICC Latest T20 ODI Rankings
ICC Latest T20 ODI Rankings (source IANS and AFP)
author img

By ETV Bharat Sports Team

Published : Nov 13, 2024, 4:06 PM IST

ICC Latest T20 ODI Rankings : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ బుధవారం తాజా వన్డే ర్యాంకింగ్స్​ విడుదల చేసింది. పాకిస్థాన్ క్రికెటర్లు ఈ ర్యాంకింగ్స్​లో ఆధిపత్యం చెలాయించారు. బౌలింగ్ ర్యాంకింగ్స్​లో పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిది 696 రేటింగ్స్​తో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. అలాగే బ్యాటింగ్ ర్యాంకింగ్స్​లో పాకిస్థాన్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ 825 రేటింగ్స్​లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

టీమ్ ఇండియా వన్డే, టెస్టు కెప్టెన్ రోహిత్​ శర్మ బ్యాటింగ్ ర్యాకింగ్స్​లో 765 పాయింట్లలో రెండో ప్లేస్​ను దక్కించుకున్నాడు. భారత యంగ్ ప్లేయర్ శుభ్ మన్ గిల్ 763 రేటింగ్స్​లో మూడో స్థానంలో నిలిచాడు. 746 రేటింగ్స్​లో విరాట్ నాలుగో ప్లేస్​లో, హ్యారీ టెక్టార్ ఐదో స్థానంలో ఉన్నారు. టీమ్ ఇండియా ఆటగాళ్లు రోహిత్, విరాట్, గిల్​కు మాత్రమే టాప్-10 బ్యాటర్లలో చోటు దక్కింది. బుమ్రా, కుల్దీప్ యాదవ్, సిరాజ్​ బౌలింగ్ ర్యాంకింగ్స్​లో టాప్-10లో చోటు సంపాదించుకున్నారు.

టీ20ల్లో టాప్ ఎవరంటే? - ఇక లేటెస్ట్​​ టీ20 ర్యాంకింగ్స్​లో బ్యాటింగ్​ విభాగంలో సూర్య కుమార్ యాదవ్​ ఒక స్థానం కోల్పోయి 803 పాయింట్లతో మూడు ర్యాంకులో నిలిచాడు. ఆసీస్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ 881 రేటింగ్స్​తో అగ్రస్థానంలో ఉన్నాడు. పిల్ సాల్ట్ రెండో ప్లేస్, సూర్య, బాబర్ ఆజామ్, మహ్మద్ రిజ్వాన్ తర్వాతి స్థానాల్లో నిలిచారు. టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్​లో ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదీల్ రషీద్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. తర్వాత స్థానాల్లో హసరంగ, హోసెన్, తీక్షణ, మోతీ, రషీద్ ఖాన్ నిలిచారు. టాప్-10లో టీమ్ ఇండియా ఆటగాడు రవి బిష్ణోయ్(7వ ప్లేస్) కు మాత్రమే చోటు దక్కింది.

అందుకే పాక్ ప్లేయర్లు టాప్​లోకి - ఆస్టేలియాతో ఇటీవల జరిగిన సిరీస్​లో రాణించడం వల్ల వన్డే ర్యాంకింగ్స్​లో పాకిస్థాన్ ప్లేయర్లు మంచి ర్యాంకింగ్స్ ను సాధించారు. ఆసీస్​తో జరిగిన మూడు వన్డే సిరీస్​లో అఫ్రిది 8 వికెట్లు పడగొట్టాడు. అతడి సగటు 12.62. దీంతో మూడు స్థానాలు ఎగబాకి ర్యాంకింగ్స్​లో ఫస్ట్ ప్లేస్​ను దక్కించుకున్నాడు. అలాగే ఇదే సిరీస్​లో పాక్ బ్యాటర్లు బాబర్ ఆజామ్, మహ్మద్ రిజ్వాన్ అదరగొట్టారు. దీంతో వారిద్దరూ బ్యాటింగ్ విభాగంలో మంచి ర్యాంకింగ్స్​ను దక్కించుకున్నారు. కాగా, ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్​లో సూర్యకుమార్ యాదవ్ ఫెయిల్ అవ్వడం వల్ల మూడు స్థానాలు కిందకు పడిపోయి మూడో స్థానానికి పడిపోయాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ - పీసీబీ వైఖరిపై పాక్ ప్రభుత్వం కీలక నిర్ణయం!

పాకిస్థాన్ ప్లేయర్లకు మరో సమస్య - గట్టి షాకిచ్చిన భారత్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.