ETV Bharat / sports

రోహిత్​ నెంబర్​ .2 - ఐసీసీ ర్యాంకింగ్స్​లో బెస్ట్ ర్యాంక్స్​ ఎవరు సాధించారంటే? - ICC LATEST RANKINGS - ICC LATEST RANKINGS

ICC Latest Rankings : ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్ రోహిత్‌ శర్మ అత్యుత్తమ ర్యాంక్​లో ఉన్నాడు. ఇంకెవరెవరు ఏయే ప్లేస్​లు సొంతం చేసుకున్నారంటే ?

ICC Latest Rankings
Rohit Sharma (Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Aug 14, 2024, 3:35 PM IST

ICC Latest Rankings : ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొట్టాడు. బుధవారం వచ్చిన ఈ ర్యాంకింగ్స్​లో ఒక ర్యాంక్ ఎగబాకి రెండో స్థానానికి చేరుకున్నాడు. అయితే ఇప్పటి వరకూ రోహిత్ కెరీర్​లో నమోదైన బెస్ట్ ర్యాంక్ ఇదే కావడం విశేషం.

అయితే అంతకుముందు విడుదలైన ఐసీసీ ర్యాంకింగ్స్​లో రోహిత్ మూడో స్థానంలో ఉన్నాడు.ఇప్పుడీ ర్యాంక్​తో అంతకుముందు రెండో స్థానంలో ఉన్న యంగ్​ ప్లేయర్ శుభ్​మన్ గిల్​ను వెనక్కినెట్టి రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక రోహిత్ తర్వాతి స్థానాల్లో విరాట్ కోహ్లీ, ఐర్లాండ్ బ్యాటర్ టెక్టార్ ఉండగా, పాకిస్థాన్ ప్లేయర్ బాబర్ ఆజమ్ మాత్రం నెంబర్ వన్ పొజిషన్​లో కొనసాగుతున్నాడు. ఇక విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు.

మరోవైపు బౌలర్లలో సౌతాఫ్రికా ప్లేయర్ కేశవ్ మహారాజ్ టాప్ ర్యాంక్​లో కొనసాగుతుండగా, ఆ తర్వాతి పొజిషన్స్​లో ఇంగ్లాండ్ ప్లేయర్ జోష్ హాజిల్ వుడ్, ఆస్ట్రేలియా ప్లేయర్ ఆడమ్ జంపా, టీమ్ఇండియా బౌలర్ కుల్​దీప్ యాదవ్ ఉన్నారు. జస్‌ప్రీత్‌ బుమ్రా ఎనిమిదో స్థానంలో ఉండగా, మరో భారత బౌలర్ మహ్మద్‌సిరాజ్ ఐదు స్థానాలు దిగజారి పదో స్థానానికి పడిపోయాడు.

ఇదిలా ఉండగా, వన్డే ఆల్ రౌండర్స్ ర్యాంకింగ్స్​లో షకీబ్ అల్ హసన్, సికిందర్ రజా టాప్ పొజిషన్​లో ఉన్నారు. దునిత్‌ వెల్లెకే 15 స్థానాలు మెరుగుపడి 54వ స్థానంలో నిలిచాడు. మహ్మద్ నబీ 320 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. శ్రీలంక సిరీస్‌లో 6 వికెట్లు తీసిన భారత ఆటగాడు అక్షర్ పటేల్ 83వ ర్యాంక్‌లో ఉన్నాడు.

శ్రీలంక సిరీస్​లో రోహిత్ మెరుపులు
శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ 2-0 తేడాతో ఓడిపోయినప్పటికీ, టీమ్ఇండియా కెప్టెన్​ రోహిత్ శర్మ ఆటతీరు అద్భుతంగా ఉంది. వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ మొత్తం 157 పరుగులు చేశాడు. రెండు అర్ధ సెంచరీలు సాధించాడు. అయితే విరాట్ కోహ్లీ 3 మ్యాచ్‌ల్లో కేవలం 58 పరుగులు మాత్రమే చేశాడు.

ICC ర్యాంకింగ్స్: సత్తాచాటిన రోహిత్, గిల్, విరాట్- టాప్ 5లో ముగ్గురు మనోళ్లే - ICC Ranking

ఛాంపియన్స్ ట్రోఫీకి రూ.584 కోట్ల బడ్జెట్- ఎక్స్​ట్రా రూ.34 కోట్లు కూడా! - Champions Trophy 2025

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.