ICC Champions Trophy 2025 : రానున్న ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ వేదిక కానున్న సంగతి తెలిసిందే. అయితే, భారత్ అక్కడికి ససేమిరా వెళ్లేదే లేదంటూ ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వచ్చింది. ఇప్పుడు కూడా అదే మాటపై ఉంది. దీంతో హైబ్రిడ్ మోడల్‌లో ఈ టోర్నీని నిర్వహించాలంటూ ఐసీసీ గతంలోనే యోచిస్తున్నట్లు కూడా సమాచారం.
అయితే భారత్ ఆడే మ్యాచ్‌లతో పాటు సెమీస్, ఫైనల్‌కు చేరుకుంటే వేదికల్లో కూడా మార్పులు ఉంటాయని తాజాగా సోషల్ మీడియా వేదికగా పలు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ వార్తలను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తాజాగా కొట్టిపడేసింది. అటువంటి ఆలోచనలేవీ తమకు రాలేదంటూ క్లారిటీ ఇచ్చింది.
భారత్, పాకిస్థాన్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, క్రీడలకు వాటికి సంబంధం లేదంటూ నిరూపించాల్సిన అవసరం ఎంతో ఉంది. తప్పకుండా ఈ టోర్నీని విజయవంతం చేస్తామని మేము బలంగా చెబుతున్నాం. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇక్కడే జరుగుతుందని మేము బలంగా భావిస్తున్నాం. ఈ విషయంలో మేం స్పష్టమైన వైఖరితోనే ఉన్నాం. అయితే వేదిక మార్పులంటూ వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు. పాకిస్థాన్ నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ వేదిక మారిపోతుందన్న వార్తలను మేం ఖండిస్తున్నాం. టోర్నీని అద్భుతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మా ఆతిథ్యం చరిత్రలో నిలిచిపోయేలా ఉంటుందని మేము భావిస్తున్నాం" అని పీసీబీ పేర్కొంది.
అదే ఆఖరి సారి: 2006లో భారత్ చివరిసారిగా పాకిస్థాన్‌కు వెళ్లి క్రికెట్ ఆడింది. ఆ తర్వాత టీమ్ఇండియా ప్లేయర్లు పాకిస్థాన్ వెళ్లలేదు. ఇక ఐసీసీ ఈవెంట్లలో కూడా పాకిస్థాన్ ఆతిథ్యమిచ్చే మ్యాచ్‌లు తటస్థ దేశాల్లో జరిగాయి. రీసెంట్గా 2023 ఆసియా కప్‌నకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండగా, టీమ్ఇండియా ప్లేయర్లను భారత ప్రభుత్వం అక్కడికి పంపలేదు. ఇరుజట్ల మధ్య మ్యాచ్‌లను తటస్థ వేదిక శ్రీలంకలో నిర్వహించింది ఆసియా క్రికెట్ బోర్డు.
టెర్రర్ అటాక్‌ల కారణంగా 2012 తర్వాత ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు పూర్తిగా రద్దయ్యాయి. టీమ్ఇండియా సైతం పాక్ గడ్డపై క్రికెట్ ఆడడాన్ని భారత ప్రభుత్వం నిషేధించింది.
అప్పటినుంచి భారత్- పాకిస్థాన్ మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు లేవు. ఇరుజట్లు కేవలం ఐసీసీ ఈవెంట్ (టీ20, వన్డే వరల్డ్‌కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్)లోనే పోటీ పడతున్నాయి. అయితే ప్రస్తుత పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ జాకా అష్రఫ్, భారత్- పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు పునః ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
BCCI ఫుల్ ప్రొఫెషనల్ - పాక్ క్రికెట్ బోర్డు అది నేర్చుకోవాల్సిందే! - Kamran Akmal Praises BCCI
ఒకే జట్టులో రోహిత్, విరాట్, బాబర్ - ఆ టోర్నీలో వీళ్లది సేమ్ టీమ్! - Virat Babar Azam