2024 T20 World Cup Umpires: 2024 టీ20 వరల్డ్‌కప్ నిర్వాహణకు ఐసీసీ సర్వం సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్న స్టేడియాల పనులను, మ్యాచ్‌లు జరగనున్న నగరాల్లో హోటల్ వసతుల ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఇక రీసెంట్గా వరల్డ్‌కప్ థీమ్ సాంగ్ (Official Theme Song) రిలీజ్ చేసిన ఐసీసీ, తాజాగా ఈ మెగాటోర్నీలో అంపైర్లుగా వ్యవహరించనున్న వారి పేర్లను ప్రకటించింది.
20 మంది అంపైర్లు, 6గురు మ్యాచ్ రిఫరీలతోపాటు మొత్తం 26 మందిని అఫీషియల్స్‌గా నియమించినట్లు ఐసీసీ శుక్రవారం తెలిపింది. ఈ లిస్ట్‌లో గతేడాది ఐసీసీ అంపైర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ పొందిన రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్‌తో పాటు, 2022 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో అంపైర్లుగా వ్యవహరించిన కుమార్ ధర్మసేన, క్రిస్ గఫానీ, పాల్ రీఫిల్ ఉన్నారు.
అంపైర్లు వీళ్లే! క్రిస్ బ్రౌన్, కుమార్ ధర్మసేన, క్రిస్ గఫానీ, మైకేల్ గోఫ్, అడ్రియన్ హోల్డ్‌స్టాక్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, అల్లావుడియన్ పాలేకర్, రిచర్డ్ కెటిల్‌బరో, జయరామన్ మదనగోపాల్, నితిన్ మేనన్, శామ్ నోగాజ్‌స్కీ, అహ్సన్ రజా, రషీద్ రియాజ్, పాల్ రీఫిల్, లాంగ్టన్ స రుసెర్, షాహిద్నీ సరుసేర్, అలెక్స్ వార్ఫ్, జోయెల్ విల్సన్, ఆసిఫ్ యాకూబ్.
మ్యాచ్ రిఫరీలు: డేవిడ్ బూన్, జెఫ్ క్రోవ్, రంజన్ మడుగల్లె, ఆండ్రూ పైక్రాఫ్ట్, రిచీ రిచర్డ్‌సన్, జావగల్ శ్రీనాథ్.
మళ్లీ వచ్చాడు: అయితే ప్రముఖ ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో గత కొన్నేళ్లుగా ఐసీసీ ఈవెంట్లలో టీమ్ఇండియా ఫ్యాన్స్‌ను భయపెడుతున్నాడు. తొమ్మిదేళ్లుగా ఐసీసీ ఈవెంట్లలో టీమ్ఇండియా ఆడిన నాకౌట్ మ్యాచ్‌లన్నింటిలోనూ కెటిల్‌బరో ఫీల్డ్ అంపైర్‌గా ఉన్నారు. దురదృష్టవశాత్తు భారత్ అన్నింట్లోనూ ఓడి ఇంటిబాట పట్టింది. అప్పట్లో ఈ మ్యాచ్ ఫలితాల్లో అంపైర్ కెటిల్‌బరో కూడా ఫేమస్ అయ్యారు. అలాంటి అంపైర్ మళ్లీ టీ20 వరల్డ్‌కప్‌లో అంపైర్‌గా వ్యవహరించనుండడం ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది.
కాగా, ఈ పొట్టి ప్రపంచకప్ జూన్ 2న ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి వెస్టిండీస్, అమెరికా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. టోర్నీలో మొత్తం 20 దేశాలు తలపడనున్నాయి. 28 రోజుల్లో 55 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది.
'భారత్‌కు శనిలా తగిలావు'.. అంపైర్‌పై ట్రోల్స్
సెమీ ఫైనల్స్ అంపైర్లు ఫిక్స్ - టీమ్ఇండియా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ! ఎందుకో తెలుసా?