India WTC Chances 2025 : బోర్డర్- గావస్కర్ ట్రోఫీ గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్టులో భారత్ గట్టెక్కింది. ఈ మ్యాచ్ డ్రా గా ముగిసింది. మూడు మ్యాచ్‌లు ముగిసేసరికి భారత్, ఆసీస్ 1-1తో సమంగా ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్ ఫలితం తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ పాయింట్ల పట్టిక ఎలా ఉంది? భారత్‌కు డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు ఎలా ఉన్నాయి? అనేది చర్చనీయాంశంగా మారింది. మరి పాయింట్ల పట్టిక, టీమ్ఇండియా అవకాశాలు ఎలా ఉన్నాయంటే?
తాజా టెస్టు డ్రా గా ముగిసిన తర్వాత పాయింట్ల పట్టికలో టాప్ 3 జట్ల స్థానాల్లో ఎలాంటి మార్పు లేదు. కానీ, స్వల్పంగా పాయింట్లు మారాయి. ప్రస్తుతం సౌతాఫ్రికా (63.33 శాతం) అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఆస్ట్రేలియా (58.89 శాతం), భారత్ (55.88 శాతం)తో తర్వాతి రెండు ప్లేస్ల్లో ఉన్నాయి.
ఒకవేళ గబ్బా టెస్టులో మ్యాచ్‌లో భారత్ ఫాలోఆన్‌లో పడి డ్రాగా ముగిసిఉంటే పరిస్థితి ఇంకాస్త క్లిష్టంగా మారేది. పర్సంటేజీ ఇంకా పడిపోయేది. కానీ, తొలి ఇన్నింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా - ఆకాశ్‌దీప్ అద్భుత పోరాటంతో టీమ్ఇండియా ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కింది.
- 2-2తో గెలిస్తే : ప్రస్తుత సిరీస్‌లో ఆస్ట్రేలియాతో భారత్ మరో రెండు టెస్టుల్లో తలపడనుంది. ఈ రెండింట్లోనూ టీమ్‌ఇండియా గెలిస్తే, ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకుంటుంది.
- 2-1తో సొంతం చేసుకుంటే : ఒకవేళ సిరీస్‌ను 2- 1 తేడాతో భారత్ సొంతం చేసుకుంటే, అప్పుడు శ్రీలంక- ఆసీస్ మధ్య టెస్టు సిరీస్‌పై ఆధారపడి ఉండాలి. అయితే ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆసీస్‌ను 1- 0 లేదా 1- 1తోనైనా శ్రీలంక ఓడించాలి.
- 2-2తో డ్రా గా ముగిస్తే : ఐదు టెస్టుల సిరీస్‌ను భారత్ 2- 2తో సమం చేస్తే, అప్పుడు టీమ్‌ఇండియా పరిస్థితి కాస్త క్లిష్టంగా మారనుంది. ఆసీస్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను శ్రీలంక 2-0 తేడాతో కైవసం చేసుకోవాలి. అలా జరిగితేనే భారత్ ఫైనల్ అర్హత సాధించే అవకాశాలు ఉంటాయి.
- లంకపై ఆసీస్ నెగ్గినా : ఇక బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ 2- 2తో సమం అయ్యి, శ్రీలంకపై ఆస్ట్రేలియా 2- 0తో టెస్టు సిరీస్‌ను గెలిచినా భారత్‌కు అవకాశం ఉంటుంది. కానీ, అప్పుడు సౌతాఫ్రికాపై పాకిస్థాన్ 2- 0తో టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకోవాల్సి ఉంటుంది.
The play has been abandoned in Brisbane and the match is drawn.
— BCCI (@BCCI) December 18, 2024
After the Third Test, the series is evenly poised at 1-1
Scorecard - https://t.co/dcdiT9NAoa#TeamIndia | #AUSvIND pic.twitter.com/GvfzHXcvoG
ఆసక్తిగా మారిన WTC పాయింట్ల పట్టిక - టాప్ 1కు భారత్ చేరాలంటే సమీకరణాలు ఇలా!