Domestic Cricketers Who Did not Get Chance In National Team : భారతదేశానికి చాలా బలమైన డొమెస్టిక్ సర్క్యూట్ ఉంది. ఇప్పటి వరకు దేశానికి చాలా మంది ఉత్తమ క్రికెటర్లను అందించింది. ఐపీఎల్ రాకతో, డొమెస్టిక్ స్ట్రక్చర్ మరింత బలపడింది. కొంత మంది అరుదైన ప్రతిభావంతులు టీమ్ ఇండియా అవకాశాలు అందుకుని సత్తా చాటుతున్నారు. డొమెస్టిక్ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్న కొందరు మాత్రం ఇంకా నేషనల్ జట్టు నుంచి పిలుపు కోసం వేచి చూస్తున్నారు. ఇప్పుడు డొమెస్టిక్ క్రికెట్‌లో అద్భుతాలు సృష్టించి, జాతీయ జట్టులో చోటు దక్కని టాప్ ప్లేయర్స్ గురించి తెలుసుకుందాం.
అమోల్ ముజుందార్
ముంబయికి చెందిన ఓపెనర్ అమోల్ ముజుందార్ చాలా సీజన్‌లలో జట్టు బ్యాటింగ్‌లో మూలస్తంభంగా ఉన్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతని స్థిరమైన ప్రదర్శనలు, జాతీయ జట్టులో చోటు కల్పిస్తాయని చాలా మంది భావించారు. కానీ అతను ఎప్పుడూ తుది జట్టులోకి రాలేదు.
ఫస్ట్ క్లాస్ : 171 మ్యాచ్‌లు, 11,167 పరుగులు, 48.13 యావరేజ్
లిస్ట్ A : 113 మ్యాచ్‌లు, 3,286 పరుగులు, 38.20 యావరేజ్
టీ20లు : 14 మ్యాచ్‌లు, 174 పరుగులు, 19.33 యావరేజ్
అనుస్తుప్ మజుందార్
అనుస్తుప్ మజుందార్ బెంగాల్‌కు కీలకమైన ఆటగాడు. అతను IPLలో కొన్ని సీజన్లు ఆడినప్పటికీ, తన ప్రతిభను ప్రదర్శించడానికి తగినన్ని అవకాశాలు పొందలేదు. అతని ప్రదర్శనలు జాతీయ సెలక్టర్లను ఆకర్షించ లేకపోయాయి.
ఫస్ట్ క్లాస్ : 88 మ్యాచ్‌లు, 5,341 పరుగులు, 43.07 యావరేజ్
లిస్ట్ A : 88 మ్యాచ్‌లు, 2,769 పరుగులు, 43.26 యావరేజ్
టీ20లు : 37 మ్యాచ్‌లు, 526 పరుగులు, 20.23 యావరేజ్
జలజ్ సక్సేనా
మధ్యప్రదేశ్‌కు చెందిన ఆల్‌రౌండర్ జలజ్ సక్సేనా భారత డొమెస్టిక్ క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాడు. అతని బౌలింగ్, బ్యాటింగ్ స్కిల్స్ ఐపీఎల్‌లో చోటు సంపాదించి పెట్టాయి. చాలా ఫ్రాంచైజీలకు ఎంపికైనప్పటికీ ఒక లీగ్ మ్యాచ్ ఆడే అవకాశం దక్కింది. ఇప్పటి వరకు జాతీయ జట్టు పిలుపు అందలేదు.
ఫస్ట్ క్లాస్ : 140 మ్యాచ్‌లు, 6,692 పరుగులు, 33.80 యావరేజ్, 444 వికెట్లు, 25.75 బౌలింగ్ యావరేజ్
లిస్ట్ A : 104 మ్యాచ్‌లు, 2,035 పరుగులు, 25.75 యావరేజ్, 117 వికెట్లు, 29.88 బౌలింగ్ యావరేజ్
టీ20లు : 70 మ్యాచ్‌లు, 661 పరుగులు, 16.52 యావరేజ్, 72 వికెట్లు, 18.43 బౌలింగ్ యావరేజ్
షెల్డన్ జాక్సన్
సౌరాష్ట్రకు చెందిన వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ షెల్డన్ జాక్సన్ డొమెస్టిక్ క్రికెట్‌లో చాలా కాలంగా అదరగొడుతున్నాడు. ఫస్ట్ క్లాస్, లిస్ట్ A మ్యాచ్‌లలో సత్తా చాటడంతో అతనికి కోల్‌కతా, బెంగళూరు ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. అయితే అతను లీగ్‌లో అంచనాలను అందుకోలేకపోయాడు. జాతీయ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించలేకపోయాడు.
ఫస్ట్ క్లాస్ : 98 మ్యాచ్‌లు, 6,949 పరుగులు, 46.95 యావరేజ్
లిస్ట్ A : 81 మ్యాచ్‌లు, 2,654 పరుగులు, 36.35 యావరేజ్
టీ20లు : 84 మ్యాచ్‌లు, 1,812 పరుగులు, 27.45 యావరేజ్
బాబా అపరాజిత్
తమిళనాడు జట్టుకు ఆడుతున్న బాబా అపరాజిత్ గత ఐదు నుంచి ఆరు సీజన్‌లుగా ఆడుతూ టీమ్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రధాన బ్యాటర్లలో ఒకరిగా ఉండటమే కాకుండా, బౌలింగ్ కూడా చేయగలడు. అతన్ని ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రైజింగ్ పూణె సూపర్‌జెయింట్‌లు కొనుగోలు చేసినా, నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం రాలేదు. డొమెస్టిక్ క్రికెట్‌లో అద్భుత రికార్డులు ఉన్నప్పటికీ, ఇంకా జాతీయ జట్టుకు ఎంపిక కాలేదు.
ఫస్ట్ క్లాస్ : 90 మ్యాచ్‌లు, 4,571 పరుగులు, 38.73 యావరేజ్, 61 వికెట్లు, 42.75 బౌలింగ్ యావరేజ్
లిస్ట్ ఏ : 107 మ్యాచ్‌లు, 3,869 పరుగులు, 42.98 యావరేజ్, 71 వికెట్లు, 28.80 బౌలింగ్ యావరేజ్
టీ20లు : 63 మ్యాచ్‌లు, 1,147 పరుగులు, 27.30 యావరేజ్, 17 వికెట్లు, 21.41 బౌలింగ్ యావరేజ్
రంజీ ట్రోఫీలో మెడల్ ప్రజెంటేషన్- క్రికెట్‌లో పతకం ఇదే తొలిసారి!