Ravichandran Ashwin Mankading : మన్కడింగ్ అనగానే క్రికెట్ ప్రియులకు టక్కున గుర్తొచ్చే పేరు టీమ్ ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. ఎందుకంటే అతడితోనే ఈ మన్కడింగ్ వివాదం మొదలైంది. తన బౌలింగ్‌లో నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న ప్రత్యర్థి బ్యాటర్ బంతి వేయక ముందే క్రీజ్ దాటినందుకు ఔట్ చేయించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే తాజాగా తమిళనాడు ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో అశ్విన్‌కే మన్కడింగ్ రుచి చూపించాడు ఓ బౌలర్. ఇందుకు సంబంధించిన ఆసక్తికర వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. మన్కడింగ్ బాస్కే దాని గురించి హెచ్చరించారని కామెంట్లు పెడుతున్నారు క్రికెట్ ప్రియులు.
అశ్విన్‌కు ఝలక్ ఇచ్చిన బౌలర్ - తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో భాగంగా దిండిగల్ డ్రాగన్స్, నెల్లాయ్ రాయల్ కింగ్స్ ఆదివారం తలపడ్డాయి. దిండిగల్ డ్రాగన్స్ జట్టు బౌలర్ ఎస్. మోహన్ ప్రశాంత్ 15వ ఓవర్లో బౌలింగ్ వేశాడు. అప్పుడు నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న రవిచంద్రన్ అశ్విన్ బౌలర్ బంతి వేయకముందే క్రీజ్ దాటే ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన ప్రశాంత్ బంతి వేయడం ఆపి అశ్విన్‌ను హెచ్చరించాడు. విషయం అంపైర్ దృష్టికి తీసుకెళ్లాడు. దిగ్గజ క్రీడాకారుడికి ప్రశాంత్ ఇలా ముచ్చెమటలు పట్టించిన వైనం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అలాగే మ్యాచ్ సమయంలో కామెంటేటర్లు కూడా నవ్వుతున్నట్లు వీడియోలో కనిపించింది. ఈ వీడియోను స్టార్ స్పోర్ట్ తమిళ్ క్యాప్షన్‌తో పంచుకుంది. 'యాష్ అన్నా ఇలా చూడండి. మీరు చదివిన పాఠశాల హెడ్ మాస్టర్ అతడే' అని పోస్ట్ పెట్టింది.
మన్కడింగ్ బాస్ 'అశ్విన్' - బౌలర్ చేతిలోంచి బంతి వెళ్లకముందే నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ క్రీజు వదిలి ముందుకు వెళితే బౌలర్ ఔట్ చేసే విధానాన్ని మన్కడింగ్‌గా పిలుస్తారు. ఈ విధానాన్ని ఉపయోగించి టీమ్ ఇండియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ చాలా మందిని పెవిలియన్‌గా పంపాడు. అయితే అశ్విన్ తీరుపై కొందరు విమర్శిస్తుండగా, మరికొందరు మద్దతు తెలిపారు. మన్కడింగ్ విధానం ద్వారా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సైతం చాలా మంది ఔట్ అయ్యారు.
Ash அண்ணா be like : நீ படிச்ச School-ல நா Headmaster டா! 😎😂
— Star Sports Tamil (@StarSportsTamil) July 28, 2024
📺 தொடர்ந்து காணுங்கள் TNPL | Dindigul Dragons vs Nellai Royal Kings | Star Sports தமிழில் மட்டும்#TNPLOnStar #TNPL2024 #NammaOoruNammaGethu @TNPremierLeague pic.twitter.com/fI97alqNJl
భారత్ ఖాతాలోకి మరో రెండు పతకాలు వచ్చే ఛాన్స్ - నేటి షెడ్యుల్ ఇదే - Paris Olympics 2024