Hardik Pandya T20 World Cup 2024 : న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా టీమ్ఇండియా తమ తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా బుధవారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది రోహిత్ సేన. అయితే ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్య కీలక పాత్ర పోషించాడు. మూడు వికెట్లు తీసి జట్టును ఆదుకున్నాడు. బంగ్లాపై జరిగిన వార్మప్ మ్యాచ్‌లోనూ అద్భుతంగా ఆడి సత్తా చాటాడు. నిరుడు ఐపీఎల్‌లో పేలవ ఫామ్ కనబరిచిన ఈ స్టార్ క్రికెటర్ ఇప్పుడు ఈ మ్యాచుల్లో అత్యుత్తమ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. విమర్శకులకు తన ఆటతీరుతో సమాధానం చెప్తున్నాడు. అయితే పాండ్య నుంచి ఇలాంటి ఆటతీరును ముందే అంచనా వేసినట్లు టీమ్ఇండియా మాజీ ప్లేయర్ సంజయ్ మంజ్రేకర్ తాజాగా అన్నాడు.
" ఐర్లాండ్‌తో మ్యాచ్ కంటే ముందు నుంచే నేను ఈ విషయాన్ని పలు మార్లు చెప్పాను. గతంలో జరిగిన వరల్డ్ కప్ టోర్నీల్లో హార్దిక్ ఆల్‌రౌండర్‌గా కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు కూడా అదే తరహాలో పోషిస్తాడు. 2019 వరల్డ్ కప్‌లోనూ ఇలాంటి ఫామ్‌నే కనబరిచాడు. భారత్ - పాక్ వంటి పెద్ద మ్యాచుల్లోనూ పాండ్యా రాణించాడు. అడిలైడ్ వేదికగా జరిగిన సెమీస్‌లోనూ ఈ స్టార్ క్రికెటర్ దూకుడుగా బ్యాటింగ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇంతకుముందు వార్మప్ మ్యాచ్‌లోనూ, అలాగే ఇప్పటి ఐర్లాండ్ మ్యాచ్‌లోనూ అదరగొట్టాడు. ఇప్పుడు చూస్తున్న హార్దిక్‌కు, ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ సారథిగా ఉన్న హార్దిక్‌కు చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడు అతడు బయట నుంచి చాలా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నాడు. జట్టులోని వాతావరణం కూడా అంత గొప్పగా లేదు. నేషనల్ టీమ్‌లోకి వచ్చాక హార్దిక్ చాలా రిలాక్స్‌గా అయిపోయాడు. అప్పటికి ఒత్తిడి ఉండదు. అందుకే, హార్దిక్ పెర్ఫామెన్స్ నాకేమీ ఆశ్చర్యం కలిగించలేదు. పెద్ద మ్యాచుల్లో హార్దిక్ రాణిస్తాడని బలంగా నమ్ముతాను" అని మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు.
టీ20 వరల్డ్‌కప్‌లో హార్దిక్ - రోహిత్‌కు ఇష్టం లేదా ? - T20 World Cup 2024 Squad