ETV Bharat / sports

ముంబయి నుంచి హార్దిక్ ఔట్?!- అలా జరిగితే ఆ జట్టులోకి ఎంట్రీ! - HARDIK PANDYA IPL 2025

హార్దిక్ పాండ్యాను వదులుకోనున్న ముంబయి ఇండియన్స్ - నిజమెంత?

Hardik Pandya IPL 2025
Hardik Pandya (Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Oct 18, 2024, 9:35 AM IST

Hardik Pandya Mumbai Indians : ఐపీఎల్ 2025 మెగా వేలం త్వరలో జరగనుంది. అయితే ఈ వేలంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యను విడిచిపెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హార్దిక్​ను రాయల్ ఛాలెంజర్స్​(ఆర్​సీబీ) జట్టు దక్కించుకోకున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ హార్దిక్​ను ముంబయి ఎందుకు వదులుకోవాలనుకుంటోంది? తదితర విషయాలను ఈస్టోరీలో తెలుసుకుందాం.

తిరిగి సొంత గూటికి
ఐపీఎల్​లో చాలా ఏళ్ల పాటు ముంబయి ఇండియన్స్​కు హార్దిక్ ప్రాతినిధ్యం వహించాడు. కొన్ని సీజన్ల ముందు ముంబయిని విడిచిపెట్టి, గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడాడు. మళ్లీ గతేడాది సొంతగూటికి చేరాడు. దీంతో హార్దిక్ ముంబయి జట్టుకు కెప్టెన్ అయ్యాడు. అప్పటి ముంబయి కెప్టెన్ రోహిత్​ను తప్పించి, పాండ్యకు అవకాశం ఇవ్వడంపై అభిమానులు ఫైరయ్యారు. క్రికెట్ పండితులు సైతం హార్దిక్ ట్రాక్ రికార్డు అంత గొప్పగా లేదని అభిప్రాయపడ్డారు. అయితే హార్దిక్​పై నమ్మకంతో కెప్టెన్​గా అవకాశం ఇచ్చింది యాజమాన్యం. గత సీజన్​లో ముంబయి ఆశించనమేర రాణించలేకపోయింది. ఘోరంగా విఫలమైంది. దీంతో హార్దిక్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

ఆర్​సీబీలోకి హార్దిక్
ముంబయి ఇండియన్స్ ఈ ఏడాది వేలంలో హార్దిక్​ను వదులుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలా చేస్తే హార్దిక్ ఆర్​సీబీ తరఫున ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడట. అయితే ఈ వార్తల్లో ఏమాత్రం నిజం ఉందన్న విషయం తేలాల్సి ఉంది. ఈ ఊహాగానాలపై హార్దిక్, లేకుంటే ముంబయి యాజమాన్యం స్పందించి చెక్ పెట్టాల్సి ఉందని అభిమానుల మాట.

ముంబయి పక్కా ప్లాన్!
ముంబయి ఇండియన్స్ ఆటగాళ్ల కొనుగోళ్ల విషయంలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. హార్దిక్ పాండ్యను తిరిగి జట్టులోకి తీసుకురావడం వెనుక పెద్ద ప్లానే ఉంది. భవిష్యత్ కెప్టెన్​గా హార్దిక్ పనికొస్తాడని యాజమాన్యం నమ్మకం. పాండ్య నాయకత్వ లక్షణాలు, జట్టు నడిపించే తీరు, యువ క్రికెటర్లను ప్రోత్సహించే తీరు వంటివి నచ్చి అతడికి కెప్టెన్​గా అవకాశాలిచ్చినట్లు తెలుస్తోంది.

అందుకే రోహిత్ స్థానంలో హార్దిక్
రోహిత్ శర్మ ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు గుడ్ బై చెప్పాడు. వయసు, ఫిట్​నెస్ కారణంగా హిట్​మ్యాన్​ మరికొన్నేళ్లు మాత్రమే క్రికెట్ ఆడగలడని తెలుస్తోంది. ఈ క్రమంలో రోహిత్ స్థానంలో హార్దిక్​కు ముంబయిు కెప్టెన్ గా అవకాశం ఇచ్చినట్లు క్రికెట్ వర్గాల మాట.

ఇక ఐపీఎల్​లో హార్దిక్ పాండ్య 137 మ్యాచ్​లు ఆడి, 2,525 పరుగులు చేశాడు. అలాగే 64 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్​లో బెస్ట్ ఆల్ రౌండర్​గా పేరు తెచ్చుకున్నాడు. గుజరాత్​కు కెప్టెన్​గా వ్యవహరించి మంచి మార్కులు కొట్టేశాడు.

హార్దిక్ పాండ్య 'నో లుక్ షాట్'- ఏమి కాన్ఫిడెన్స్ బాసు!- వీడియో వైరల్ - Hardik No Look Shot

'ఐయామ్‌ సారీ' - హార్దిక్‌కు క్షమాపణలు చెబుతున్న ముంబయి ఫ్యాన్స్​ - Mumbai Fans Sorry To Hardik

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.