GT Vs UP Warriors: 2024 డబ్ల్యూపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు హ్యాట్రిక్ ఓటములు ఎదురయ్యాయి. టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్ జట్టు గుజరాత్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గుజరాత్ నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని, యూపీ 15.4 ఓవర్లలో ఛేదించింది. యూపీ జట్టులో గ్రేస్ హారిస్ (60* పరుగులు; 33 బంతుల్లో: 9x4, 2x6) మెరుపు హాఫ్ సెంచరీతో రఫ్పాడించింది. గుజరాత్ బౌలర్లలో తనుజా కన్వర్ 2, కాథ్రిన్ బ్రీస్, మేఘనా సింగ్ తలో వికెట్ దక్కించుకున్నారు. గ్రేస్ హారిస్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు' లభించింది
ఓ మోస్తారు టార్గెట్ ఛేదనను యూపీ ఘనంగానే ఆరంభించింది. ఓపెనర్లు అలీసా హీలీ (33 పరుగులు) రాణించింది. అయితే ఐదో ఓవర్లో తనుజా గుజరాత్‌కు బ్రేక్ ఇచ్చింది. ఆమె కిరణ్ నౌగిరె (12 పరుగులు) వికెట్ తీసింది. ఆ తర్వాతి ఓవర్లోనే మరో ఓపెనర్ హీలీని బ్రీస్ క్లీన్‌బౌల్డ్ చేసి యూపీకి షాకిచ్చింది. కాసేపటికే దూకుడుగా అడే ప్రయత్నం చేసిన చమీర అతపట్టు (17 పరుగులు)ను తనుజా పెవిలియన్ చేర్చింది. దీంతో గుజరాత్ మూడో వికెట్ కోల్పోయింది.
స్కోర్ పరుగులు పెడుతున్నా, ఆ తర్వాతి ఓవర్లో శ్వేత సెహ్రావత్ (2 పరుగులు) కూడా ఔటైంది. దీంతో గుజరాత్ శిబిరంలో ఆశలు చిగురించాయి. కానీ, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్రేస్ గుజరాత్ బౌలర్లను బెంబేలెత్తించింది. ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. ఈ క్రమంలోనే అర్ధ శతకం పూర్తి చేసుకుంది. మరో ఎండ్‌లో ఉన్న దీప్తీ శర్మ (17* పరుగులు) రాణించడం వల్ల యూపీ విజయం ఖరారైంది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. ఫోబి లిచీఫీల్డ్ (35 పరుగులు), గార్డ్నర్ (30 పరుగుల) రాణించారు. ఓపెనర్ వోల్వార్ట్ (28 పరుగులు) ఫర్వాలేదనిపించింది. ఇక మూనీ (16 పరుగులు), హర్లీన్ డియోల్ (18 పరుగులు) విఫలమయ్యారు.
స్మృతి, విరాట్ జెర్సీ నెంబరే కాదు - ఆ విషయంలో ఇద్దరిదీ సేమ్ రూట్!
బ్యాటింగ్ మెరుపులు- ఫీల్డింగ్ విన్యాసాలు- IPL రేంజ్ కిక్కిస్తున్న WPL