ETV Bharat / sports

'RCBతో నా జర్నీ ముగిసిపోలేదు- ఆల్రెడీ వీడియో కాల్​లో మాట్లాడాను!'

ఆర్సీబీ రిటెన్షన్స్​పై మ్యాక్స్​వెల్ రియాక్షన్- ఫ్రాంచైజీతో బంధం ముగిసిపోలేదని కామెంట్

Glenn Maxwell IPL 2025
Glenn Maxwell IPL 2025 (Source: Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : 2 hours ago

Glenn Maxwell IPL 2025 : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ తనను రిటైన్​ చేసుకోకపోవడంపై ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్​వెల్ స్పందించాడు. రిటెన్షన్స్ పట్ల ఆర్సీబీ యాజమాన్యం తనకు సర్దిచెప్పిందని అన్నాడు. ఆ పరిస్థితులను వాళ్లు హ్యాడింల్ చేసిన విధానం తనకు నచ్చిందని తెలిపాడు. అలాగే ఆర్సీబీతో తన ప్రయాణం ఇక్కడితో ముగిసిపోలేదని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

'రిటెన్షన్స్​ నేపథ్యంలో ఆర్సీబీ మేనేజ్​మెంట్ నుంచి నాకు కాల్ వచ్చింది. ఆండీ ఫ్లవర్, మో బొబాట్​తో జూమ్​ కాల్​లో మాట్లాడాను. వాళ్లు నన్ను రిటెన్​ చేసుకోకపోవడం గురించి మాట్లాడారు. అదొక మంచి ఫేర్​వెల్ మీటింగ్​లాగా అనిపించింది. దాదాపు 30నిమిషాలపాటు నా గేమ్​ గురించి, ఆర్సీబీ ఫ్యూచర్ స్ట్రాటజీ​ గురించి చర్చించాము. దాని పట్ల నేను హ్యాపీగానే ఉన్నా' అని రీసెంట్​గా ఓ స్పోర్ట్స్ వెబ్​సైట్​తో మాట్లాడాడు.

'ఆర్సీబీ స్టాఫ్​లో కూడా మార్పులు చేసింది. రిటెన్షన్స్​కు వాళ్లకు కూడా ఓ ప్రాసెస్ ఉంటుంది. అది నేను అర్థం చేసుకోగలను. నన్ను అట్టిపెట్టుకున్నారో లేదో అని రిటెన్షన్స్ లిస్ట్ వచ్చే వరకు నేను కూడా ఆత్రుతగా ఉన్నాను. కానీ, ఫారిన్ ప్లేయర్ల రూల్​ కూడా దీనికి కారణం అయ్యి ఉండవచ్చు. ఆర్సీబీతో నా జర్నీ ముగిసిందని నేను అనుకోవడం లేదు. మళ్లీ ఆ జట్టులో భాగం అవ్వడానికి ఇష్టపడతాను. ఆర్సీబీ తరఫున ఆడడాన్ని ఎంజాయ్ చేశాను' అని మ్యాక్స్​వెల్ పేర్కొన్నాడు.

కాగా, 2021 నుంచి మ్యాక్సీ ఆర్సీబీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తాజా రిటెన్షన్స్​లో మాత్రం ఆర్సీబీ మ్యాక్సీని వదులుకుంది. అతడితోపాటు కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్, కామెరూన్ గ్రీన్, విల్ జాక్స్​లాంటి హిట్టర్లను కూడా వేలంలోకి రిలీజ్ చేసింది. అయితే ఆర్సీబీ రూ.83 కోట్ల భారీ మొత్తంతో వేలంలోకి వెళ్లనుంది. ఆ ఫ్రాంచైజీకి మూడు ఆర్​టీఎమ్ కార్డ్​లు కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మ్యాక్స్​వెల్​తోపాటుగా తమ పాత ప్లేయర్లను వేలంలో కొనుగోలు చేసే ఛాన్స్ లేకపోలేదు.

ఆర్సీబీ రిటెన్షన్స్ 2025

  • విరాట్ కోహ్లీ - రూ.21 కోట్లు
  • రజత్ పటిదార్ - రూ. 11 కోట్లు
  • యశ్ దయాల్ - రూ. 5 కోట్లు

'ఆ రోజు నాలో ఉన్న అభిమానిని కోల్పోయాడు'- సెహ్వాగ్​తో మ్యాక్సీ గొడవ!

మ్యాక్సీ 'ఓవర్​రేటడ్'​ - మాజీ క్రికెటర్​కు తప్పని ట్రోల్ సెగ - Glenn Maxwell RCB

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.