Glenn Maxwell IPL 2024: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ 2024 ఐపీఎల్లో పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. గురువారం ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు బంతులు ఎదుర్కొన్న మ్యాక్స్‌వెల్ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు. ముంబయి స్పిన్నర్ శ్రేయస్ గోపాల్ బౌలింగ్‌లో డిఫెన్స్ ఆడబోయిన మ్యాక్స్‌వెల్ వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఈ క్రమంలో మ్యాక్స్‌వెల్ ఐపీఎల్లో చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఐపీఎల్లో అత్యధికసార్లు డకౌటైన బ్యాటర్‌గా రోహిత్ శర్మ, దినేశ్ కార్తిక్‌ను మ్యాక్సీ సమం చేశాడు. ఐపీఎల్ కెరీర్లో రోహిత్ శర్మ, దినేశ్ కార్తిక్ చెరో 17సార్లు డకౌట్ కాగా, మ్యాక్స్‌వెల్ తాజాగా వీరితో చేరిపోయాడు.
ఇక భారీ అంచనాలతో 2024 ఐపీఎల్ బరిలో దిగిన మ్యాక్స్‌వెల్ ఆశించిన స్థాయిలో ప్రదర్శన కనబర్చడం లేదు. ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన మ్యాక్స్‌వెల్ కేవలం 32 పరుగులు చేసి ఘోరంగా విఫలమయ్యాడు. కాగా ఈ సీజన్లోనే మ్యాక్సీ మూడుసార్లు డకౌటవ్వడం గమనార్హం. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ మ్యాక్స్‌వెల్‌పై ఫైర్ అవుతున్నారు. తమ దేశం ఆస్ట్రేలియా తరఫున ఆడినట్లు, ఆర్సీబీ ఆడట్లేదని ఆరోపిస్తున్నారు.
ఐపీఎల్లో అత్యధిక సార్లు డకౌటైన ప్లేయర్లు
- రోహిత్ శర్మ, దినేశ్ కార్తిక్, మ్యాక్స్‌వెల్- 17 సార్లు
- రషీద్ ఖాన్, పీయుశ్ చావ్లా, సునీల్ నరైన్, మన్దీప్ సింగ్- 15 సార్లు
- మనీశ్ పాండే, అంబటి రాయుడు- 14 సార్లు.
ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఫాఫ్ డూప్లెసిస్ (61 పరుగులు), రజత్ పటీదార్ (50 పరుగులు), దినేశ్ కార్తిక్ (53* పరుగులు) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (3), విల్ జాక్స్ (9), మ్యాక్స్‌వెల్ (0) విఫలమయ్యారు. ఇక ముంబయి బౌలర్లలో జస్ర్పీత్ బుమ్రా 5 వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టాడు. ఇక గెరాల్డ్ కాట్జీ, ఆకాశ్ మధ్వాల్, శ్రేయస్ గోపాల్ తలో వికెట్ దక్కించుకున్నారు.
ముంబయి Vs ఆర్సీబీ - ఈ ఆటలో ఇద్దరూ గెలవాల్సిందే! - MI Vs RCB IPL 2024
అత్యధిక పరుగులే కాదు - ఆ రికార్డులోనూ విరాట్‌కు తిరుగేలేదు! - Virat Kohli RCB