ETV Bharat / sports

క్రికెట్ కోసం ప్రేయసికి షరతు! గంభీర్,నటాషా లవ్​ స్టోరీ గురించి తెలుసా? - Gautam Gambhir Love Story - GAUTAM GAMBHIR LOVE STORY

Gautam Gambhir Love Story : టీమ్ఇండియా మాజీ క్రికెటర్, ప్రస్తుత హెడ్​కోచ్​గౌతమ్ గంభీర్ క్రికెట్ కెరీర్ గురించి అందరికీ తెలిసిందే. మైదానంలో ఎప్పుడూ సీరియస్​గానే ఉండే ఆయనకు ఓ స్వీట్ లవ్​స్టోరీ ఉందని తక్కువ మందికే తెలుసు. క్రికెట్ మీద ఉన్న ప్రేమతో ఆయన పెళ్లికి ముందే తన ప్రేయసికి ఓ కండీషన్ పెట్టాడట. ఇంతకీ అదేంటో? గంభీర్ లవ్​ జర్నీ ఎలా సాగిందో ఈ స్టోరీలో చూసేయండి.

Gautam Gambhir Love Story
Gautam Gambhir Love Story (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 11, 2024, 7:00 PM IST

Gautam Gambhir Love Story : టీమ్​ఇండియా హెడ్​కోచ్​గా మాజీ క్రికెట్ గౌతమ్ గంభీర్ తాజాగా ఎంపికయ్యారు. తన క్రికెట్​ కెరీర్​లో టీమ్ఇండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన ఈ స్టార్ క్రికెటర్, 2011 వరల్డ్ కప్​ గెలుపులోనూ కీలకపాత్ర పోషించాడు. ఐపీఎల్​ కోల్​కతా నైట్​రైడర్స్ జట్టుకు మెంటర్​గానూ కీలక బాధ్యతలు చేపట్టారు. అయితే మైదానంలో అతడు చాలా వరకు సీరియస్​గానే కనిపిస్తాడు. కానీ ఈ సీరియస్ మ్యాన్​ లైఫ్​లో ఓ సూపర్ లవ్​ స్టోరీ ఉంది. ఔనండి గౌతమ్ గంభీర్​ది లవ్ మ్యారేజ్. అయితే తన లవ్ స్టోరీలో ఎన్నో ట్విస్ట్​లు ఉన్నాయట. అవేంటంటే?

గౌతమ్ గంభీర్, నటాషా జైన్ 2007లో ఓ ఫ్రెండ్ ఇచ్చిన పార్టీలో ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయినా ఈ విషయాన్ని వారిద్దరూ బయటకు చెప్పలేదు. ఎందుకంటే గౌతమ్ గంభీర్ అంతర్జాతీయ క్రికెట్​లో రాణిస్తున్న సమయమది. అలాగే నటాషా కూడా తన కెరీర్ ఫోకస్ పెట్టారు. అలా ఈ జంట కొన్నాళ్ల పాటు తమ కెరీర్​పై ఫోకస్​ పెడుతూనే తమ లవ్ లైఫ్​ను ఆస్వాదించారు.

పెళ్లికి ముందు ప్రేయసికి కండీషన్
కొన్నేళ్ల డేటింగ్ తర్వాత ఈ ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎంగేజ్​మెంట్ చేసుకున్న ఏడాది తర్వాత అంటే 2011 అక్టోబరు 29న గౌతమ్- నటాషా సన్నిహితుల సమక్షంలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

అయితే, నటాషాతో పెళ్లికి ముందు గౌతమ్ ఆమెకు ఒక షరతు పెట్టారట. కెరీర్ ఇప్పుడు ఉత్తమ దశలో ఉంది కాబట్టి 2011 వరల్డ్ కప్ అయిన తర్వాతనే ఆమెను వివాహం చేసుకుంటానని నటాషాతో అన్నారట. దానికి ఆమె కూడా ఓకే చెప్పారట. ఇక ఆ మాటను నిలబెట్టుకుంటూ వరల్డ్ కప్ తర్వాత గంభీర్ నటాషాను పెళ్లాడారు.

కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్
గంభీర్- నటాషా దంపతులు 2014లో అజీన్ అనే పండంటి ఆడబిడ్డకు తల్లిదండ్రులయ్యారు. 2017లో ఈ దంపతులకు అనైజా అనే మరో కుమార్తె కూడా జన్మించింది. గంభీర్ తన భార్య, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులతో గడిపేందుకు ఇష్టపడతారు. అలాగే తన భార్య నటాషా గురించి పలు ఇంటర్వ్యూల్లో ప్రశంసలు కురిపించారు. తాను జీవిత భాగస్వామిగా సరైన వ్యక్తిని పొందానంటూ పలు మార్లు చెప్పుకొచ్చారు.

అయితే గౌతమ్ గంభీర్, నటాషా జైన్ తొలి పరిచయం 2007లో జరిగినా, వారి కుటుంబాల మధ్య స్నేహం మధ్య దశాబ్దాల క్రితం నాటిది. గంభీర్, నటాషా తండ్రులిద్దరూ వ్యాపారవేత్తలు. అంతేకాకుండా వారు కొన్ని సంవత్సరాలుగా స్నేహితులు కూడా. దీంతో ఇరు కుటుంబాల మధ్య సన్నిహత సంబంధాలు ఉండేవి. ఆ సంబంధాలే గంభీర్- నటాషా పెళ్లి మరింత ఈజీగా జరిగేటట్లు చేశాయి.

గంభీర్ గ్యారేజీలో ఉన్న​ లగ్జరీ కార్లు ఇవే - అతడి నెట్​వర్త్​ ఎన్ని కోట్లో తెలుసా? - Gautam Gambhir Networth

గంభీర్​ 5 బిగ్ టార్గెట్స్​- 2027పైనే స్పెషల్ ఫోకస్- ఏం చేస్తాడో? - Gautam Gambhir Targets

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.