ETV Bharat / sports

'నువ్వు బ్యాటింగ్ చేయడం నేనైతే చూడలేదు'-కుల్దీప్​పై రోహిత్ సెటైర్ - Rohit Sharma Kuldeep Yadav - ROHIT SHARMA KULDEEP YADAV

Rohit Sharma Kuldeep Yadav: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ సహచర ఆటగాళ్లతో చాలా సరదాగా ఉంటాడు. తాజాగా కుల్దీప్​తో జరిగిన ఓ ఫన్నీ సీన్ నెట్టింట వైరలైంది. మీరు ఆ వీడియో చూశారా?

Rohit Sharma Kuldeep Yadav
Rohit Sharma Kuldeep Yadav (Source: Associated Press (Left), Getty Images (Right))
author img

By ETV Bharat Telugu Team

Published : May 30, 2024, 12:51 PM IST

Rohit Sharma Kuldeep Yadav: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ- స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మధ్య తాజా సంభాషణ సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. ఐసీసీ లేటెస్ట్​గా 'టీమ్ ఆఫ్ ది వన్డే 2023' జట్టును ప్రకటించింది. అయితే ఆ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్​గా ఎంపికయ్యాడు. రోహిత్ సహా మరో 5గురు (విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్, శుభ్​మన్ గిల్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ) ఆ జట్టులో స్థానం దక్కించుకున్నారు. ఈ క్రమంలో కుల్దీప్​కు 'ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్' క్యాప్​ను రోహిత్ అందించాడు.

క్యాప్ అందుకున్న కుల్దీప్​ను రోహిత్ మాట్లాడవల్సిందిగా కోరాడు. దీంతో 'చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు. గతేడాది నేను బౌలింగ్​తోపాటు బ్యాటింగ్​లోనూ బాగా రాణించాను' అని కుల్దీప్ అన్నాడు. దీనికి వెంటనే రోహిత్ షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు. 'బ్యాటింగా? నువ్వు ఎప్పుడు బ్యాటింగ్ చేశావు?' అని అడిగాడు. అప్పుడు కుల్దీప్ టెస్టు సిరీస్​లో అని బదులివ్వగా, 'ఇది వన్డే టీమ్' అని రోహిత్ అన్నాడు. అయినప్పటికీ 'నేను బ్యాట్​తో కూడా మంచి ప్రదర్శన చేశాను'అని కుల్దీప్ చెప్పగానే, 'నేను ఈ జట్టుకు కెప్టెన్​. అతడు ఎప్పుడు బ్యాటింగ్ చేయడం నేను చూడలేదు. అతడు ఏం మాట్లాడుతున్నాడో నాకైతే తెలీదు' అని రోహిత్ ఫన్నీగా కౌంటర్ ఇచ్చాడు. దీంతో డ్రెస్సింగ్ రూమ్​ కాసేపు సరదాగా మారిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. రోహిత్ రియాక్షన్స్ ఫన్నీగా ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Team India T20 World Cup: వరల్డ్​కప్ సమీపిస్తున్న నేపథ్యంలో టీమ్ఇండియా ఆటగాళ్ల బృందం ఇప్పటికే అమెరికా చేరుకుంది. రోహిత్, జైస్వాల్, సూర్యకుమార్, కుల్దీప్, సిరాజ్ తదితరులు గ్రౌండ్​లో దిగి ప్రాక్టీస్ మొదలు పెట్టేశారు. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో భారత్ జూన్ 5న ఐర్లాండ్​తో తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్​తో జూన్ 9న న్యూయార్క్​లో తలపడనుంది.

పొట్టికప్​లో కోహ్లీయే టాప్ స్కోరర్- రోహిత్ ప్లేస్ ఎంతంటే? - T20 World Cup 2024

'రోహిత్ ఆడియోను ప్రసారం చేయలేదు - నీతికి కట్టుబడి ఉన్నాం' - IPL 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.