ETV Bharat / sports

సాక్షితో ధోనీ బర్త్​ డే సెలబ్రేషన్స్​- సల్మాన్ ఖాన్ స్పెషల్ విషెస్ - MS Dhoni Birthday - MS DHONI BIRTHDAY

MS Dhoni Birthday Celebrations: మిస్టర్ కూల్ ఎమ్​ఎస్ ధోనీకి బర్త్​ డే విషెస్ వెల్లువెత్తున్నాయి. ధోనీ సతీమణి సాక్షి కేక్ కట్ చేయించి బర్త్ డే సెలబ్రేట్ చేసింది.

MS Dhoni Birthday
MS Dhoni Birthday (Source: Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 7, 2024, 9:41 AM IST

MS Dhoni Birthday Celebrations: టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఆదివారం తన 43వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ధోనీకి సినిమా ఇండస్ట్రీ, క్రీడా ప్రముఖులు, ఫ్యాన్స్​ అతడికి విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ 'హ్యాపీ బర్త్​డే కెప్టెన్ సాబ్' అంటూ సోషల్ మీడియాలో విషెస్ చెప్పారు. మరోవైపు ధోనీ సహచర ప్లేయర్, మాజీ క్రికెటర్ సురేశ్ రైనా కూడా ధోనీకి శుభాకాంక్షలు తెలిపాడు.

ఐపీఎల్​ టైమ్​లో ధోనీ ఫ్యామిలీతో దిగిన ఫొటో ఒకటి షేక్ చేశాడు. 'హ్యాపీ బర్త్​డే మహీ భాయ్. నీ హెలికాప్టర్ షాట్​, స్టంపింగ్ స్కిల్స్​లా రోజూ నువ్వు కూల్​గా ఉండాలని కోరుకుంటున్నా' అని రాసుకొచ్చాడు. అటు బీసీసీఐ కూడా అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్​లో ధోనీ బర్త్ డే పోస్ట్ షేర్ చేసింది. కెప్టెన్​గా సాధించిన మూడు ఐసీసీ ట్రోఫీ (టీ20, వన్డే, ఛాంపియన్స్ ట్రోఫీ)లతో ఉన్న ధోనీ ఫొటోను షేర్ చేసింది.

సాక్షి స్పెషల్ సెలబ్రేషన్స్: ధోనీ సతీమణి సాక్షి సింగ్ భర్తతో కేక్ కట్ చేయించి అతడికి విషెస్ తెలిపింది. ధోనీకి కేక్ తినిపించిన సాక్షి ఆ తర్వాత తన కాళ్లకు నమస్కరించింది. ధోనీ కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. ఈ సెలబ్రేషన్​లో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా పాల్గొన్నారు.

100 ఫీట్ల కటౌట్: అంధ్ర ప్రదేశ్​లో మహీ ఫ్యాన్స్ 100 ఫీట్ల కటౌట్ ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా నందిగామ మండలం అంబారుపేట దగ్గరున్న హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి పక్కనే ధోనీ ఆ భారీ కటౌట్‌ను ఫ్యాన్స్​ ఏర్పాటు చేశారు. హైవే పక్కనే ఉండడం వల్ల ఇది అందర్నీ ఆకట్టుకుంటోంది. సోషల్​ మీడియాలో దీనికి సంబంధించిన ఫొటోలు ఫుల్ వైరల్ అయ్యాయి. అభిమానులు అడ్వాన్స్ హ్యాపీ బర్త్​డే అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, ధోనీ ఫ్యాన్స్​ ప్రతి సంవత్సరం అక్కడ ధోనీ కటౌట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అలా గతేడాది 77 అడుగుల కటౌట్​ పెట్టగా ఈ సారి 100 అడుగుల కటౌట్‌ను ఏర్పాటు చేశారు.

ధోనీ కెరీర్​లో టాప్ ఇన్నింగ్స్- ఆ మ్యాచ్​తోనే 'ధనాధన్​' ట్యాగ్! - MS Dhoni Birthday

100 అడుగుల ధోనీ కటౌట్‌ - తెలుగు ఫ్యాన్స్ అభిమానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.