Fastest 50 and 100 in Test Format : కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ఇండియా మరో రికార్డు సృష్టించింది. టెస్టు ఫార్మాట్లో వేగంగా 50, 100 పరుగులు చేసిన జట్టుగా భారత్ అవతరించింది. కేవలం 18 బంతుల్లోనే టీమ్ఇండియా 50 పరుగులు చేసేసింది. అలాగే 10.1 ఓవర్లలోనే 100 రన్స్ చేసి అరుదైన రికార్డును ఖాతాలో వేసుకుంది. అలాగే టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా 50, 100, 150, 200, 250 పరుగులను నమోదు చేసిన జట్టుగా టీమ్ఇండియా నిలిచింది.
కాగా, 2023లో వెస్టిండీస్‌తో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో టీమ్ఇండియా 12.2 ఓవర్లలో 100 పరుగులు తీసింది. తాజాగా బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో ఆ రికార్డును బద్దలుగొట్టింది. ఈ క్రమంలో టెస్టుల్లో ఫాస్ట్‌గా 50, 100 పరుగులు చేసిన మరికొన్ని జట్ల గురించి తెలుసుకుందాం పదండి.
ఫాస్టెస్ట్ 100 పరుగులు చేసిన జట్లు ఇవే :
అదరగొట్టిన శ్రీలంక
2001లో కొలంబో వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన టెస్టు మ్యాచ్ లో శ్రీలంక జట్టు అదరగొట్టింది. కేవలం 13.2 ఓవర్లలోనే శతకం బాదింది.
స్వదేశంలో చితకబాదుడు
అయితే 1994లో ఓవల్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు దూకుడు ప్రదర్శించింది. 13.2 ఓవర్లలోనే 100 పరుగుల చేసి రికార్డు సృష్టించింది.
బంగ్లా విధ్వంసం
2012లో మిర్పూర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో బంగ్లా జట్టు విధ్వంసం సృష్టించింది. దీంతో 13.4 ఓవర్లలోనే జట్టు స్కోరు 100కు చేరుకుంది.
ఇంగ్లాండ్ జట్టు దూకుడు
2022లో రావల్పండిలో ఇంగ్లాండ్, పాకిస్థాన్ జట్లు ఓ టెస్టు మ్యాచ్‌లో తలపడ్డాయి. అందులో ఇంగ్లాండ్ జట్టు 13.4 ఓవర్లలో 100 పరుగులు చేసింది.
అతిథ్య జట్టుకు షాక్
2002లో కరాచీ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు దూకుడు ప్రదర్శించింది. దీంతో కేవలం 13.4 ఓవర్లలోనే ఇంగ్లీష్ జట్టు స్కోరు 100కు చేరింది.
ఫాస్టెస్ట్ 50 చేసిన జట్లు
2024లో కాన్పూర్ వేదికగా బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా కేవలం 18 బంతుల్లోనే 50 పరుగులు చేసేసింది. దీంతో టెస్టుల్లో అత్యంత వేగంగా 50 పరుగులు చేసిన జట్టుగా రోహిత్ సేన అవతరించింది.
- ఇదిలా ఉండగా, 2024లో విండీస్ జట్టుపై ఇంగ్లాండ్ 26 బంతుల్లో 50 పరుగులు చేసింది. ఆ రికార్డును టీమ్ఇండియా తాజాగా బద్దులుకొట్టింది.
- ఇక 1994లో సౌతాఫ్రికాపై ఇంగ్లాండ్ టీమ్ 27 బంతుల్లో ఫిఫ్టీ చేసింది.
- ఇలాగే 2002లో శ్రీలంకపై ఇంగ్లాండ్ 30 బంతుల్లో 50 రన్స్ చేసింది.
- అయితే 2004లో పాకిస్థాన్‌పై శ్రీలంక 32 బంతుల్లోనే 50 పరుగులు బాదింది.
- ఇవి కాకుండా 2008లో ఇంగ్లాండ్‌పై టీమ్ఇండియా 33 బంతుల్లోనే 50 రన్స్ చేసింది.
- అలాగే 2023లో విండీస్ జట్టుపై భారత్ 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసింది.
జడేజా 'ట్రిపుల్ సెంచరీ' - టీమ్ఇండియా ఆల్‌రౌండర్ రేర్ రికార్డ్ - Ravindra Jadeja 300 Wickets