Team India New Head Coach: టీమ్ఇండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం జూన్‌లో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త కోచ్ ఎంపికకు సంబంధించి బీసీసీఐ రీసెంట్గా ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో కాబోయే టీమ్ ఇండియా హెడ్ కోచ్ ఎవరు? అనే అంశంపై చర్చలు మొదలయ్యాయి. ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి? ఎవరి పేరు ఎక్కువగా వినిపిస్తుందో? ఇప్పుడు చూద్దాం.
ఇప్పటివరకు హెడ్‌కోచ్ పదవికి అప్లై చేసుకున్న వారి వివరాలు అధికారికంగా వెల్లడించలేదు. అయితే సోషల్ మీడియాలో భారత మాజీ క్రికెటర్, NCA డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ పేరు ఎక్కువగా ప్రచారం అవుతోంది. ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ తన పదవీ కాలంలో విరామం తీసుకున్నప్పుడల్లా స్టాండ్-ఇన్ ఇండియా కోచ్‌గా లక్ష్మణ్ ముందున్నాడు.
కోచ్‌గా లక్ష్మణ్ అనుభవం: రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలో యంగ్ ఇండియన్ టీమ్ హాంగ్‌జౌ 2023 ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. ఆ పోటీల్లో లక్ష్మణ్ యంగ్ టీమ్ఇండియా కోచ్‌గా ఉన్నాడు. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్‌గా ఉన్నాడు. జట్టు పనితీరును అర్థం చేసుకోవడం, జట్టు దీర్ఘకాలిక దృష్టి, లక్ష్యాలపై అవగాహన ఉండటం లక్ష్మణ్‌కు అనుకూలంగా పని చేస్తుంది.
భారత కోచ్ పదవిపై జస్టిన్ లాంగర్ ఆసక్తి: లక్ష్మణ్‌ను కొందరు ఫారిన్ కోచ్‌ల నుంచి పోటీ ఎదురుకావచ్చు. వారిలో ప్రధాన ప్రత్యర్థి ఆస్ట్రేలియా మాజీ ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్. బీసీసీఐ ప్రధాన కోచ్ ప్రకటన వెలువడగానే, కోచ్ పదవిపై లాంగర్‌కి ఆసక్తి ఉన్నట్లు మీడియా నివేదికలు వచ్చాయి.
విదేశీ కోచ్‌ని నియమించే అవకాశం? ఆస్ట్రేలియాకి లాంగర్ నాలుగు సంవత్సరాలు కోచ్‌గా వ్యవహరించాడు. అతని గైడెన్స్‌లోనే ఆస్ట్రేలియా 2021 టీ20 వరల్డ్ కప్ గెలిచింది. లాంగర్ అధికారికంగా ఇండియా కోచ్ పదవికి అప్లై చేసుకుంటే, అతడికి మెరుగైన అవకాశాలు ఉండవచ్చు. విదేశీ కోచ్‌ల నుంచి కూడా అప్లికేషన్‌లు ఆహ్వానిస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జే షా పేర్కొనడంతో పోటీ తీవ్రమైంది.
కొత్త కోచ్ ముందు కఠినమైన సవాళ్లు: కొత్త కోచ్ పదవీకాలం జులై 1 నుంచి మొదలై 2027 డిసెంబరు 31 వరకు మూడున్నరేళ్ల పాటు కొనసాగనుంది. కొత్తగా బాధ్యతలు చేపట్టే కోచ్ 2027లో జరిగే వన్డే ప్రపంచకప్ టోర్నీ ముగిసే వరకు ఈ పదవిలో ఉంటాడు. ఈ ఏడాది చివరిలో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్, ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. వచ్చే ఏడాది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారతదేశం పోటీలో ఉంది. ఈ కీలక సిరీస్‌లు ప్రధాన కోచ్‌కి సవాళ్లుగా నిలువనున్నాయి.
హెడ్‌కోచ్‌కు అర్హతలు ఇవే:
- కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునే వారి వయసు 60 ఏళ్ల లోపు ఉండాలి.
- కనీసం 30 టెస్టులు/ 50 వన్డేలు ఆడి ఉండాలి. లేదా టెస్టులు ఆడుతున్న జట్టుకు కనీసం రెండేళ్ల పాటు హెడ్‌కోచ్‌గా వ్యవహరించి ఉండాలి.
- లేదంటే ఐపీఎల్ జట్టు, ఇంటర్నేషనల్ లీగ్ జట్టు, ఫస్ట్ క్లాస్ టీమ్, నేషనల్ ఏ జట్టు ఏదైనా ఒకదానికి కనీసం మూడేళ్ల పాటు హెచ్ కోచ్‌గా పనిచేసి ఉండాలి.
టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తులు ఆహ్వానం! - Teamindia HeadCoach
రంజీ ట్రోఫీ ఫార్మాట్ ఛేంజ్- ఇకపై రెండు దఫాలుగా- ఎందుకంటే? - Ranji Trophy 2024