ETV Bharat / sports

దులీప్ ట్రోఫీలో ఇండియా Aకి తొలి విజయం- అయ్యర్ జట్టుకు వరుసగా రెండో ఓటమి - Duleep Trophy 2024 - DULEEP TROPHY 2024

Duleep Trophy 2024: దులీప్‌ ట్రోఫీ 2024లో ఇండియా ఎ తొలి విజయం దక్కించుకుంది. ఇండియా డి తో జరిగిన మ్యాచ్​లో 186 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Ind C vs Ind B
Ind C vs Ind B (Source: Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : Sep 15, 2024, 2:54 PM IST

Updated : Sep 15, 2024, 3:35 PM IST

Duleep Trophy 2024: దులీప్‌ ట్రోఫీ 2024లో ఇండియా ఎ తొలి విజయం నమోదు చేసింది. ఇండియా డి తో జరిగిన మ్యాచ్​లో 186 పరుగుల భారీ తేడాతో నెగ్గింది. 488 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో దిగిన ఇండియా డి 301-10 పరుగులకు ఆలౌటైంది. తనుష్ కొటియాన్ 4, షమ్స్ ములాని 3, ఖలీల్ అహ్మద్, రియాన్ పరాగ్ చెరో 1 వికెట్ దక్కించుకున్నారు. కాగా, తాజా మ్యాచ్​చో ఇండియా డి జట్టు వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. ఇక ఆల్​ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన షమ్స్ ములాని (89 పరుగులు, 5 వికెట్లు)కి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.

సంక్షిప్త స్కోర్లు

  • IND A : 290- 10 & 380/3 d
  • IND D : 183- 10 & 301- 10

మరోవైపు ఇండియా సి, ఇండియా బి మధ్య మ్యాచ్‌ డ్రాగా ముగింది. ఇండియా సి రెండో ఇన్నింగ్స్‌లో 128/4 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అంతకు ముందు ఇండియా బి తొలి ఇన్నింగ్స్‌లో 332, ఇండియా సి తొలి ఇన్నింగ్స్‌లో 525 పరుగులు చేసింది. ఇండియా సి బ్యాటర్లలో రుతురాజ్‌ గైక్వాడ్‌ 62 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్​లో ఇండియా బి రెండో ఇన్నింగ్స్‌ ఆడకుండానే ఆట డ్రా అవ్వడం విశేషం. ఇక తొలి ఇన్నింగ్స్​లో 8 వికెట్లతో సత్తా చాటిన అంశుల్ కంభోజ్​కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.

సంక్షిప్త స్కోర్లు

  • IND B : 332 - 10
  • IND C : 525 & 128/4 d

అంశుల్ కాంభోజ్ రేర్ ఫీట్
ఇండియా C బౌలర్ అంశుల్ ఈ మ్యాచ్​లో అరుదైన ఘనత సాధించాడు. అతడు తొలి ఇన్నింగ్స్​లో 8 వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో దులీప్ ట్రోఫీలో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలను నమోదు చేసిన ఐదో బౌలర్‌గా నిలిచాడు. ఇక దేబశీశ్‌ మొహంతీ (10/46), అశోక్‌ దిండా (8/123) తర్వాత అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన మూడో పేసర్‌గా కాంభోజ్ (8/69) నిలిచాడు.

సెంచరీతో చెలరేగిన తిలక్ వర్మ- భారీ ఆధిక్యంలో ఇండియా A - Duleep Trophy 2024

ఇషాన్ బ్యాక్​ టు ఫామ్- రీ ఎంట్రీలో సెంచరీల మోత - Duleep Trophy 2024

Last Updated : Sep 15, 2024, 3:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.