Disqualifed Players In Paris Olympics 2024 : భారత రెజ్లర్ వినేశ్ పొగాట్ స్వర్ణం కోసం జరగాల్సిన తుదిపోరులో బరువు ఎక్కువగా ఉండటం వల్ల డిస్‌క్వాలిఫై అయ్యారు. 2024 పారిస్ ఒలింపిక్స్ ఈవెంట్‌లోని రెజ్లింగ్ పోటీల్లో 50 కేజీల విభాగంలో ఆమె ఫైనల్‌లో తలపడాల్సి ఉంది. పోటీ జరిగే రోజు ఉదయం ఫిజికల్ మెజర్మెంట్స్ తీసుకుంటున్న సమయంలో వంద గ్రాముల బరువు ఎక్కువగా ఉందని తెలిసింది. దాంతో ఆమెను పోటీకి డిస్‌క్వాలిఫై చేశారు. ఇలా మల్టీనేషనల్ ఈవెంట్స్‌లో ఇండియన్ అథ్లెట్లు డిస్‌క్వాలిఫై అవడం తొలిసారేం కాదు. మేజర్ స్పోర్ట్స్ ఈవెంట్లలో దాదాపు 10 మంది డిస్‌క్వాలిఫై అయ్యారు. ఇంతకీ వారెవరంటే?
పర్వీన్ హూడా: 2024 ఒలింపిక్స్ ఈవెంట్లో 57 కేజీల విభాగంలో పాల్గొన్న ఈ బాక్సర్ సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇంటర్నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జరిపిన డోపింగ్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. డోపింగ్‌కు పాల్పడినట్లు తెలియడంతో ఆమె నుంచి 2022 హాంగ్జౌ ఏసియన్ గేమ్స్ కాంస్య పతకాన్ని కూడా రద్దు చేశారు.
సీమా అంటిల్ : ఇండియాకు చెందిన డిస్కస్ త్రోయర్ సీమా అంటిల్ కూడా డిస్‌క్వాలిఫై అయ్యారు. నాలుగు సార్లు కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలను గెలుచుకోవడంతో పాటు, 2002 వరల్డ్ జూనియర్ ఛాంపియన్‌షిప్స్‌లో గోల్డ్ మెడల్ కూడా దక్కించుకున్నారు. నాసల్/సైనస్ సమస్య ఉన్న వారు ఉపయోగించే సూడఫెడ్రైన్ అనే డ్రగ్ వాడటం వల్ల పోటీ నుంచి పక్కన పెట్టేశారు.
సునీతా రాణి : లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ పోటీల్లో పాల్గొనే సునీతా రాణి (పద్మ శ్రీ అవార్డు విన్నర్) 2002 ఆసియా గేమ్స్‌లో 1500 మీ పందెంలో స్వర్ణం, 5000మీ పందెంలో బ్రాంజ్ పతకాలను సాధించారు. ఆ తర్వాత డోపింగ్ టెస్టుల్లో ఫెయిల్ అయి పతకాలను విచారణ పూర్తయిన తర్వాత అందిస్తామంటూ హోల్డ్‌లో పెట్టింది.
అనిల్ కుమార్, నీలమ్ సింగ్: అర్జున అవార్డు గ్రహీతలైన డిస్కస్ త్రోయర్స్ అనిల్ కుమార్, నీలమ్ సింగ్. కామన్వెల్త్ గేమ్స్‌లో ఇండియాకు తొలి పతకాన్ని తెచ్చి డోపింగ్ కారణంగా రెండేళ్ల సస్పెన్షన్‌ను ఎదుర్కొన్నారు. నోరాండ్రోస్టిరాన్ అనే డ్రగ్ తీసుకోవడం వల్ల వీరిద్దరూ డోపింగ్‌లో పాజిటివ్‌గా తేలారు. దీంతో ఏసియన్ చాంపియన్‌షిప్స్‌కు అనర్హత వేటును ఎదుర్కొన్నారు అనిల్ కుమార్. నీలం సింగ్ కామెన్వెల్త్ గేమ్స్‌లో సాధించిన సిల్వర్ మెడల్ రద్దు అయింది.
శాంతి సౌందరాజన్ : విశ్వక్రీడల్లో పతకం గెలిచిన తొలి తమిళ మహిళ శాంతి. 2006 దోహా ఏషియన్ గేమ్స్ 800 మీటర్ల పరుగు పందెంలో వెండి పతకాన్ని గెలుచుకున్నారు. ఆ తర్వాత ఆమె లింగ నిర్ధారణ పరీక్షలో ఫెయిల్ కావడంతో ఆ పతకం రద్దు అయింది.
సౌరబ్ విజ్ : షాట్ పుట్ ప్లేయర్ సౌరబ్ విజ్ సైతం సిల్వర్ మెడల్‌ను త్యజించాల్సి వచ్చింది. 2012 ఏసియన్ ఇండోర్ గేమ్స్‌లో సిల్వర్ మెడల్, 2010 కామన్వెల్త్ గేమ్స్‌లో స్థానం దక్కించుకున్నాడు. ఏసియన్ గేమ్స్ ర్వాత మిథైల్ హెక్సానీమైన్ తీసుకున్నట్లు తెలియడం వల్ల రెండేళ్ల పాటు నిషేదాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ జరిపిన విచారణలో నేరారోపణ రుజువు కాకపోవడం వల్ల కొద్ది వారాల్లోనే అతనికి క్లీన్ సర్టిఫికేట్ వచ్చి కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనవచ్చని తేలింది.
హరికృష్ణన్ మురళీధరన్, మన్‌దీప్ కౌర్, సైనీ జోస్, అశ్విని అక్కున్జీ : 2011లో భారత నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఆరుగురు మహిళా అథ్లెట్లకు సంవత్సరం పాటు నిషేధాన్ని విధించింది. వారిలో కామన్వెల్త్ గేమ్స్‌లో, ఏసియన్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన వారు ఉన్నారు. లాంగ్ జంపర్ హరికృష్ణన్ మురళీధరన్, 4x400 రిలే టీమ్ మెంబర్స్ మన్‌దీప్ కౌర్, సైనీ జోస్, అశ్వినీ అక్కున్జీలు ఉన్నారు. ఏసియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌కు ముందు అక్కుంజీ ఆనబోలిక్ స్టెరాయిడ్స్ తీసుకున్నట్లు తేలింది. జోస్ ఆనబోలిక్ స్టెరాయిడ్ మెథాన్డైనోన్, మన్‌దీప్ మెథాన్డైనోన్‌తో పాటు స్టానోజోలాల్ తీసుకున్నట్లు తెలిసింది.
వినేశ్ పొగాట్ అప్పీల్‌పై తీర్పు వాయిదా - మళ్లీ ఎప్పుడంటే? - Paris Olympics 2024
గోల్డ్ మెడలిస్ట్‌కు ఐఫోన్ గిఫ్ట్- లైఫ్ టైమ్ గ్రిల్ చికెన్ ఫ్రీ! - Paris Olympics 2024