Dinesh Karthik IPL Retirement : భారత జట్టు స్టార్ క్రికెటర్ దినేశ్ కార్తిక్ త్వరలో ఐపీఎల్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకనున్నాడు. ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి జట్టులో యాక్టివ్ ప్లేయర్‌గా ఉన్న కార్తిక్ రానున్న సీజన్ తర్వాత తన రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు సమాచారం. టీమ్ఇండియా జెర్సీ ధరించి కొన్ని మ్యాచులే ఆడినప్పటికీ ఐపీఎల్ సీజన్ 15లో అత్యద్భుత పెర్ఫామెన్స్‌తో జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే టీ20 ప్రపంచకప్‌లో పేలవ ఫామ్‌తో తీవ్రంగా నిరాశపరిచాడు. ఇక ఆ తర్వాతి ఐపీఎల్ సీజన్లోనూ దారుణంగా విఫలమయ్యాడు. ఆడిన 13 మ్యాచుల్లో 11.67 సగటుతో 140 పరుగులు మాత్రమే స్కోర్ చేయగలిగాడు.
అయితే ఐపీఎల్ వేదికగా దినేశ్ కార్తిక్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ తర్వాత ఎక్కువ మందిని ఈ ఫార్మాట్లో ఔట్ చేసిన వికెట్ కీపర్‌గా కార్తిక్ రికార్డుకెక్కాడు. ధోనీ 180 మందిని ఔట్ చేయగా, కార్తీక్ 169 మందిని పెవిలియన్ బాట పట్టించాడు. దిల్లీ, కోల్‌కతా జట్లకు సారథిగానూ బాధ్యతలు నిర్వర్తించాడు. 16 సీజన్లలో కార్తిక్ ఇప్పటివరకు ఆరు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. అందులో భాగంగా 242 మ్యాచ్‌లకు గానూ 4,516 పరుగులు స్కోర్ చేశాడు. వాటిలో 20 అర్ధశతకాలు ఉండటం విశేషం. అంతే కాకుండా కీపర్‌గానూ కీలక బాధ్యతలు చేపట్టి జట్టుకు మంచి స్కోర్ అందించాడు. 141 క్యాచ్‌లు పట్టుకున్నాడు. 36 స్టంప్ ఔట్లు చేశాడు. అయితే క్రికెట్‌కు దూరమయ్యాక అతడు ప్రస్తుతం అంతర్జాతీయ మ్యాచ్‌లకు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నారు. తమ మాట తీరుతో రాణిస్తున్నాడు.
ఇంటర్నేషనల్ కెరీర్ కూడా
మరోవైపు దినేశ్ త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2004లో అంతర్జాతీయ క్రికెట్ ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ స్టార్ బ్యాటర్ ఇప్పటి వరకు 26 టెస్టులు, 94 వన్డేలు, 60 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో 1025, 1752, 686 పరుగులు స్కోర్ చేశాడు.
'రింకూలో ఆ టాలెంట్ గుర్తించింది అతడే' - ధోనీ నుంచే ఆ ట్రిక్ నేర్చుకున్నాడట!