Dhoni Teammate Bus Driver: సాధారణంగా క్రికెట్ ప్లేయర్‌లు భారీగా సంపాదిస్తారని అందరూ భావిస్తారు. ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) లాంటి టోర్నీలు మొదలయ్యాక క్రికెట్ ప్లేయర్‌ల సంపాదన భారీగా పెరిగింది. అందుకే విదేశీ ఆటగాళ్లు సైతం ఐపీఎల్ ఆడటానికి ఆసక్తి చూపుతారు. కానీ వరల్డ్ కప్ జట్టులో సభ్యుడు, రెండు సీజన్లు ఐపీఎల్ ఆడిన ప్లేయర్ బస్సు డ్రైవర్‌గా పని చేస్తున్నాడంటే నమ్ముతారా? ఆ ఆటగాడు ఎవరు? అతని పరిస్థితి ఏంటో ఇప్పుడు చూద్దాం.
క్రికెట్‌లో సుదీర్ఘకాలం కొనసాగే ప్లేయర్‌లు తక్కువ మందే ఉంటారు. ఫామ్ కోల్పోయిన తర్వాత, అవకాశాలు రానప్పుడు క్రికెట్‌కి వీడ్కోలు పలుకుతారు. చాలా మంది క్రికెటర్లు రిటైర్మెంట్ తర్వాత కూడా యాడ్స్, బిజినెస్, ఇన్వెస్ట్‌మెంట్స్ ద్వారా బాగా సంపాదిస్తారు. క్రికెట్ కామెంటరీ, కోచింగ్ లేదా అడ్మినిస్ట్రేషన్‌లో ప్రవేశిస్తారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుని కూడా ఐపీఎల్ వంటి లీగ్‌లు ఆడిన ఆటగాళ్లు ఉన్నారు. అయితే క్రికెట్ తర్వాత శ్రీలంక మాజీ స్టార్ సూరజ్ రన్‌దీవ్ కెరీర్ మాత్రం ఊహించని మలుపు తిరిగింది.
సీఎస్కేలో ధోని సహచరుడు
చెన్నై సూపర్ కింగ్స్ (CSK)లో భారత స్టార్ ఎంస్ ధోనీతో కలిసి రన్‌దీవ్ ఆడాడు. 2011 ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో సీఎస్కే రన్‌దీవ్‌ని కొనుగోలు చేసింది. అతను రెండు సీజన్లలో చెన్నై ఫ్రాంచైజీకి ఆడాడు. శ్రీలంక తరఫున ప్రపంచకప్ కూడా ఆడాడు. చివరికి అతను ఇప్పుడు ఆస్ట్రేలియాలో బస్సు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.
2011 వరల్డ్ కప్ ఆడిన ప్లేయర్
2011 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్‌తో ఆడిన శ్రీలంక జట్టులో రన్‌దీవ్ సభ్యుడు. వాస్తవానికి 2011 వన్డే వరల్డ్ కప్‌కి సూరజ్ రన్‌దీవ్ సెలక్ట్ కాలేదు. అయితే ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ గాయపడటంతో రన్‌దీవ్‌కి ఆహ్వానం అందింది. క్రికెట్‌కి గుడ్ బై చెప్పిన తర్వాత రన్‌దీవ్ ఆస్ట్రేలియాకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అతడు ఆస్ట్రేలియాలో జిల్లా స్థాయి కాంపిటీషన్‌లలో కూడా ఆడాడు. 2020లో నెట్స్‌లో ఆస్ట్రేలియన్ క్రికెటర్లకు బౌలింగ్ చేయడానికి తాత్కాలిక నెట్ బౌలర్‌గా క్రికెట్ ఆస్ట్రేలియా(CA) ఆఫర్ ఇచ్చింది. తర్వాత, రన్‌దేవ్ ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ట్రాన్స్‌దేవ్ అనే సంస్థలో బస్సు డ్రైవర్‌గా ఉద్యోగం పొందాడు.
17 సీజన్లకు అదే రోటీన్ - ధోనీ సక్సెస్ సీక్రెట్ ఏంటంటే ? - DHONI CSK CAREER
ధోనీ వచ్చే సీజన్లో ఆడుతాడా - రైనా వన్ వర్డ్ ఆన్సర్ ఇదే! - IPL 2025 DHONI