ETV Bharat / sports

ధోనీ + రిపోర్టర్స్​ = 'హిలేరియస్ కాంబినేషన్'​ - ప్రెస్ మీట్​లో మిస్టర్ కూల్​ ఇచ్చిన ఫన్నీ​ ఆన్సర్స్ ఇవే! - Dhoni Funny Moments With Reporters - DHONI FUNNY MOMENTS WITH REPORTERS

Dhoni Funny Moments With Reporters :టీమ్​ఇండియాలో అత్యుత్తమైన కెప్టెన్లలో మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ ఒకడు. ఆయన తన క్రికెట్ కెరీర్​లో ఎన్నో చిరస్మరణీయ విజయాలను జట్టుకు అందించాడు. అయితే అప్పుడప్పుడు మీడియా సమావేశంలో కొన్ని ఫన్నీ సమాధానాలు చెప్పి నవ్వించారు. ఆ ఇన్సిడెంట్స్ గురించి మీకు తెలుసా?

Dhoni Funny Moments With Reporters
MS Dhoni (Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : Sep 23, 2024, 11:01 AM IST

Dhoni Funny Moments With Reporters : టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ తన కెరీర్​లో జట్టుకు ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్​ను అందించాడు. ఓ ప్లేయర్​గా, అలాగే ఓ కెప్టెన్​​గానూ జట్టును ముందుండి నడిపించాడు. ఆన్​ఫీల్డ్, అవుట్ ఫీల్డ్​లోనూ కూల్​గా ఉంటాడు ధోనీ. అందుకే ఆయన్ను ముద్దుగా మిస్టర్ కూల్ అని పిలుచుకుంటారు. అయితే ఆయన అప్పుడప్పుడు ప్రెస్ మీట్స్​లో తెలివిగా, ఫన్నీగా ఆన్సర్స్ ఇచ్చి అక్కడి వారిని నవ్వించారు. ఈ క్రమంలో ధోనీ ఫన్నీ ప్రెస్ మీట్​లపై ఓ లుక్కేద్దాం పదండి.

1. రిపోర్టర్ ప్రశ్నకు ధోనీ ఫన్నీ రిప్లై
2016 టీ20 ప్రపంచకప్​లో టీమ్​ఇండియా సెమీ ఫైనల్​లో ఓడిపోయింది. అప్పుడు ఓ విదేశీ రిపోర్టర్ ధోనీని మీ కెరీర్​లో ఇంకా చాలా సాధించిన తర్వాత రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నారా? అని ప్రశ్నించాడు. దానికి 'నేను అన్​ఫిట్ అని మీరు అనుకుంటున్నారా?' అంటూ ధోనీ జర్నలిస్టును అడిగాడు. అందుకు లేదు అని రిపోర్టర్ బదులిచ్చాడు. 2019 ప్రపంచకప్ వరకు నేను సర్వైవ్ అవ్వగలనా అని అడగ్గా, అవును అని రిపోర్టర్ అన్నాడు. "దీంతో మీరే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేశారు" అని ధోనీ హిలేరియస్​గా రిప్లై ఇచ్చాడు. దీంతో అక్కడి వారంతా ఒక్కసారిగా నవ్వారు.

2. 'ఆ స్క్రిప్ట్ తో సినిమా తీయొచ్చు'

2014లో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా టీమ్​ఇండియా క్రికెటర్లు విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్‌ మధ్య విభేదాలు తలెత్తినట్లు ఊహాగానాలు వినిపించాయి. ఈ ఊహాగానాలకు ధోనీ ఫన్నీగా చెక్ పెట్టేశాడు. మార్వెల్ లేదా వార్నర్ బ్రదర్స్ వంటి ప్రొడక్షన్ హౌజ్​లు ఈ పుకార్లను వ్యాప్తి చేసే వ్యక్తి నుంచి స్క్రిప్ట్​ను తీసుకుని సినిమా చేయాలని సూచించాడు.

3. 'నేను స్టూల్​పై లేను కదా'
2016లో రాంచీలో జరిగిన ఓ టీ20 మ్యాచ్ తర్వాత ధోనీని హెలికాప్టర్ షాట్ కొట్టకపోవడం గురించి ఓ విలేకరి ప్రశ్నించాడు. "సముద్రం కింద లేదా జలాంతర్గామిలో హెలికాప్టర్‌ ఎగరదు. అదే విధంగా ఒక నిర్దిష్ట డెలివరీకి హెలికాప్టర్ షాట్ ఆడాలి. బౌలర్ బౌన్సర్ వేస్తే హెలికాప్టర్ షాట్ కొట్టలేను. నేను స్టూల్​పై లేను కదా" అని ధోనీ సమాధానం ఇచ్చాడు. దీంతో ఒక్కసారిగా నవ్వులే నవ్వులు.

4. 'నా ఇంట్లో చాలా కార్లు, బైక్ లు ఉన్నాయి'
2018లో క్వాలిఫైయర్ 1లో సన్​రైజర్స్​తో చెన్నై తలపడింది. ఆ మ్యాచ్​లో జట్టులో హర్భజన్ సింగ్ ఉన్నప్పటికీ ఒక్క ఓవర్ కూడా ధోనీ అతడితో బౌలింగ్ చేయించలేదు. మిగతా ఐదుగురు బౌలర్లలో ఫుల్ కోటా ఓవర్లు వేయించాడు. అప్పుడు ధోనీనీ ఓ రిపోర్టర్ సీనియర్ బౌలర్ అయిన హర్భజన్​తో ఎందుకు ఒక్క ఓవర్ కూడా వేయించలేదని అడిగాడు. 'మీకు తెలుసా, నా ఇంట్లో చాలా కార్లు, బైక్​లు ఉన్నాయి. కానీ అన్నింటిని నేను ఒకేసారి రైడ్ చేయను. ఆ మ్యాచ్​లో హర్భజన్ బౌలింగ్ చేయడం అవసరమని నేను భావించలేదు. అందుకే బౌలింగ్ వేయించలేదు.' అని బదులిచ్చాడు.

5. కిషోర్ కుమార్ టు సీన్ పాల్
2011-12 ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్​లో టీమ్​ఇండియా 0-4 తేడాతో ఓడింది. ఆ తర్వాత శ్రీలంకలో జరగిన ముక్కోణపు వన్డే సిరీస్​కు చాలా మంది యువ ఆటగాళ్లు భారత జట్టులో చేరారు. వీరిలో విరాట్ కోహ్లీ, సురేశ్​ రైనా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఉమేశ్ యాదవ్ ఉన్నారు. ఈ క్రమంలో టెస్టు సిరీస్​లో సీనియర్ ఆటగాళ్లతో, వన్డే సిరీస్​లో యువ ప్లేయర్లతో ఆడటం ఏంటని అప్పటి కెప్టెన్ ధోనీని ఓ విలేకరి ప్రశ్నించాడు. పాపులర్ సింగర్ కిషోర్ కుమార్ నుంచి డీజే స్టార్ సీన్ పాల్ వైపునకు వెళ్లామని ధోనీ రిప్లై ఇచ్చాడు. దీంతో ఒక్కసారిగా అందరూ నవ్వుకున్నారు.

ఒకే ఓవర్​లో ఆరు సిక్స్ లు - యూవీ ఐకానిక్ ఇన్నింగ్స్​పై ధోనీ ఏమన్నాడంటే? - Dhoni Said This To yuvraj 6 sixes

మిస్టర్​ కూల్​కు కోపం వస్తుందా? - ఓటమితో వాటర్​ బాటిల్​ను తన్నిన మహీ! - MS Dhoni losses his cool

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.