ETV Bharat / sports

చెన్నై జట్టుకు ఊహించని షాక్​ - జట్టుకు దూరం కానున్న కాన్వే! - Devon Conway Injury

Devon Conway CSK : రానున్న ఐపీఎల్​ సీజన్​ కోసం సిద్ధమవుతున్న చెన్నై సూపర్ కింగ్ జట్టుకు తాజాగా షాక్​ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టుకు చెందిన స్టార్ క్రికెటర్ డేవన్ కాన్వే దూరం కానున్నాడు.

Devon Conway CSK
Devon Conway CSK
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 4, 2024, 11:25 AM IST

Updated : Mar 4, 2024, 12:49 PM IST

Devon Conway CSK : ఐపీఎల్ సీజన్ ప్రారంభం కాకుండానే ఫ్రాంచైజీలకు గట్టిగా షాక్ తగులుతోంది. ఇప్పటికే సర్జరీ కారణంగా మహ్మద్ షమీ గుజరాత్​ జట్టుకు దూరమవ్వగా, ఇప్పుడు చెన్నై జట్టులోనూ ఇదే జరిగింది. గాయం కారణంగా ఆ జట్టు స్టార్‌ బ్యాటర్ డేవన్ కాన్వే ఈ సీజన్‌ తొలి భాగంలో ఆడటం లేదు. అయితే ఈ విషయంపై చెన్నై ఫ్రాంచైజీ నుంచి ఇంకా అఫీషియల్ అనౌన్స్​మెంట్ రాలేదు.

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ సమయంలో కాన్వే ఎడమ చేతి బొటన వేలికి తీవ్ర గాయమైంది. దీంతో అతడికి శస్త్రచికిత్స అవసరమని డాక్టర్లు తెలిపారు. అంతే కాకుండా కనీసం 8 వారాల విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో మరో రెండు నెలలపాటు కాన్వే క్రికెట్‌కు దూరం కానున్నాడు.

అయితే ఏప్రిల్ చివరినాటికైనా సిద్ధమై రెండో సగానికి అందుబాటులో ఉండే అవకాశాలున్నాయని సమచారం. ఇక గత సీజన్‌లో సీఎస్‌కే తరఫున అత్యధిక పరుగులు చేసి రికార్డుకెక్కాడు ఈ స్టార్​ క్రికెటర్. ఆడిన 16 మ్యాచుల్లో 672 పరుగులు స్కోర్ చేశాడు.

గతేడాది ఐపీఎల్​ టైటిల్​ను చెన్నై జట్టు గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు ఈ స్టార్ ప్లేయర్ గుజరాత్‌తో జరిగిన ఫైనల్​ మ్యాచ్​లోని చివరి రెండు బంతులకు జడేజా కొట్టిన 6,4 ఎంత విలువైనవో, ఇన్నింగ్స్‌ ఆరంభంలో ఓపెనర్ డేవాన్‌ కాన్వే చేసిన 47 పరుగులు కూడా అంతే విలువైనవి. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ఈ స్టార్​ ప్లేయర్​, కేవలం 25 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 47 పరుగులను సాధించి గట్టి పునాది వేశాడు.

ఇక అదే సీజన్​లో కాన్వే 16 మ్యాచ్‌లకు 48.63 సగటుతో 672 పరుగులు​ చేశాడు. రుతురాజ్‌ గైక్వాడ్‌తో కలిసి జట్టుకు మంచి ఆరంభాలను ఇచ్చి భారీ స్కోర్లు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అప్పుడు కాన్వేను చెన్నై ఫ్రాంచైజీ రూ.కోటికి కొనుగోలు చేసింది. అయితే ఇప్పుడు కాన్వే గైర్హాజరితో, అతడి స్థానంలో న్యూజిలాండ్ బ్యాటర్ యంగ్​ ప్లేయర్ రచిన్ రవీంద్రను సీఎస్​కే ఫ్రాంచైజీ తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మినీ వేలంలో రచిన్​ను రూ.1.8 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది.

IPL 2023 CSK : రెమ్యూనరేషన్​ తక్కువ.. పెర్ఫామెన్స్‌ ఎక్కువ! సీఎస్కే విజయంలో వీరే కీలకం!

IPL 2023 : దంచికొట్టిన డేవన్ కాన్వే.. హైదరాబాద్​పై చెన్నై విజయం

Last Updated : Mar 4, 2024, 12:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.