Rishabh Pant Suspended: దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్‌కు షాక్ తగిలింది. ఇటీవల రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ కారణంగా పంత్‌పై బీసీసీఐ ఓ మ్యాచ్ నిషేధం విధించింది. దీంతోపాటు రూ.30 లక్షల జరిమానా విధిస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక దిల్లీ మే 12న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌కు పంత్ దూరం కానున్నాడు. ప్లే ఆఫ్స్‌కు ముంగిట పంత్‌పై వేటు పడడం దిల్లీ ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు.
గతంలో హెచ్చరిక: అయితే ఇదే సీజన్లో పంత్ మూడుసార్లు స్లో ఓవర్ రేట్‌కు గురయ్యాడు. ఈ క్రమంలో పంత్ ఇప్పటికే పలుమార్లు భారీ జరిమానాలు ఎదుర్కొన్నాడు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం తొలిసారి స్లో ఓవర్ రేట్‌కు గురైతే రూ. 12 లక్షలు, రెండోసారికి రూ.24 లక్షలు, మూడోసారి రిపీటైతే మ్యాచ్ ఫీజులో 100శాతం కోత ఉంటుంది. దీంతోపాటు ఓ మ్యాచ్‌లో ఆడకుండా నిషేధిస్తారు.
ఈ నేపథ్యంలో పంత్‌పై గతనెల ముంబయి ఇండియన్స్‌తో మ్యాచ్ తర్వాతే వేటు పడాల్సి ఉంది. ఇక రీసెంట్గా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇదే పొరపాటు రిపీట్ అయ్యింది. దీంతో దిల్లీ కెప్టెన్ పంత్‌పై వేటు పడింది. కాగా, ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌పై దిల్లీ 20 పరుగుల తేడాతో గెలుపొందింది.
-
RISHABH PANT HAS BEEN SUSPENDED FOR THE MATCH vs RCB DUE TO OVER-RATE PENALTY....!!!! pic.twitter.com/53BeYJStFE
— Johns. (@CricCrazyJohns) May 11, 2024
Delhi Capitals IPL 2024: ఇక ప్రస్తుత సీజన్లో దిల్లీ ఇప్పటివరకు 12 మ్యాచ్‌ల్లో ఆరింట్లో నెగ్గి, అన్నే మ్యాచ్‌ల్లో ఓడింది. దీంతో 12 పాయింట్లతో పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో తప్పక నెగ్గాల్సిందే. కాగా, దిల్లీ మే 12న ఆర్సీబీ, మే 14న లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో తలపడాల్సి ఉంది.
రోడ్డు ప్రమాదం కారణంగా దాదాపు ఏడాదిన్నర తర్వాత ఐపీఎల్లో పంత్ బరిలోకి దిగాడు. ఈ సీజన్లో పంత్ ఫుల్‌స్వింగ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు 12మ్యాచ్‌ల్లో 156.44 స్ట్రైక్ రేట్‌తో 413 పరుగులు నమోదు చేశాడు. ఇక వెస్టిండీస్, అమెరికా సంయుక్త వేదికలుగా జూన్‌లో జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు కూడా పంత్ ఎంపికయ్యాడు.
వింటేజ్ పంత్ ఈజ్ బ్యాక్ - ధోనీ హెలికాప్టర్ షాట్‌తో విమర్శకులకు పంచ్ - IPL 2024