ETV Bharat / sports

వార్నర్​కు షాకిచ్చిన క్రికెట్ ఆస్ట్రేలియా! - ఏం జరిగిందంటే? - Warner Champions Trophy 2025

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 15, 2024, 4:48 PM IST

Updated : Jul 15, 2024, 5:00 PM IST

Warner Retirement Champions Trophy 2025 : డేవిడ్ వార్నర్‌కు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు షాకిచ్చింది. ఏం జరిగిందంటే?

source Associated Press
warner (source Associated Press)

David Warner Retirement Champions Trophy 2025 : వార్నర్‌ రీసెంట్​గా ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌ 2024తో అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అనంతరం మళ్లీ మనసు మార్చుకుని సెలక్టర్లు ఎంపిక చేస్తే ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025కు అందుబాటులో ఉంటానని తెలిపాడు. అయితే తాజాగా వార్నర్‌ అనౌన్స్​మెంట్​పై ఆసీస్​ చీఫ్ సెలక్టర్​ జార్జ్‌ బెయిలీ స్పందించాడు. తమ భవిష్యత్​ ప్రణాళికలో వార్నర్‌ లేడని, తమకు తెలిసిన సమాచారం ప్రకారం అతడు రిటైర్​ అయ్యాడని అన్నాడు. తమ ప్రణాళికల్లో కొత్త ఆటగాళ్లు ఉన్నారని పేర్కొన్నాడు. బెయిలీ మాటలను పరిశీలిస్తే వార్నర్‌ తిరిగి జట్టులోకి రావాలనుకున్నా వచ్చే అవకాశం లేదని అర్థమవుతోంది.

"డేవిడ్ వార్నర్​ రిటైర్​ అయ్యాడు. మూడు ఫార్మాట్లలో అతడి కెరీర్ అద్భుతంగా సాగింది. అందుకు అతడిని అభినందించాలి. పాకిస్థాన్​ పర్యటన విషయానికొస్తే అతడు మా ప్రణాళికలో లేడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు వేర్వేరు ఆటగాళ్లతో ముందుకెళ్తోంది" అని పేర్కొన్నాడు.

Warner Career : కాగా, 2023 వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్‌లో టీమ్​ఇండియాపై ఆస్ట్రేలియా గెలుపొందింది. ఈ మ్యాచ్‌ తర్వాత వార్నర్‌ వన్డేలకు బై చెప్పాడు. అనంతరం ఈ ఏడాది జనవరిలో పాకిస్థాన్‌తో టెస్టు మ్యాచ్‌ ఆడి దానికి రిటైర్మెంట్ ప్రకటించేశాడు. 2024 టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్​తో టీ20 ఫార్మాట్​కు వీడ్కోలు పలికాడు. మొత్తం మూడు ఫార్మాట్లలో కలిపి 18, 995 పరుగులు చేశాడు వార్నర్​.

ఇకపోతే ఈ ప్రపంచకప్​లో సూపర్‌-8 దశలోనే ఆస్ట్రేలియా నిష్క్రమించింది. త్వరలోనే ఇంగ్లాండ్​, స్కాట్లాండ్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం రెడీ అవుతోంది. మొదట స్కాట్లాండ్‌తో(Australia VS Scotland) మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ సెప్టెంబర్‌ 4, 6, 7 తేదీల్లో ఆడనుంది. అనంతరం సెప్టెంబర్​ 11 నుంచి ఇంగ్లాండ్​తో(Australia VS England) మూడు టీ20లు(సెప్టెబంర్‌ 11, 13, 15), ఐదు వన్డేలు (సెప్టెంబర్‌ 19, 21, 24, 27, 29) తలపడనుంది.

'రిటైర్మెంట్​లో ట్విస్ట్ - అలా జరిగితే తప్పకుండా మళ్లీ వస్తాను' - David Warner Retirement

'హ్యాపీగా ప్లేస్ ఖాళీ చేస్తా- రిటైర్మెంట్​పై వార్నర్ ఎమోషనల్'

Last Updated : Jul 15, 2024, 5:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.