David Warner 100 Half Century: ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన కెరీర్లో అరుదైన ఘనత అందుకున్నాడు. శుక్రవారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించి, టీ20ల్లో 100 అర్ధ శతకాలు నమోదు చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా కెరీర్లో 100వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించడం విశేషం. ఇక అన్ని ఫార్మాట్లలోనూ 100 మ్యాచ్‌లు మూడో ఆడిన మూడో క్రికెటర్‌గా నిలిచాడు. వార్నర్ కంటే ముందు న్యూజిలాండ్ బ్యాటర్ రాస్ టేలర్, విరాట్ కోహ్లీ ఈ మార్క్ అందుకున్నారు.
ఓవరాల్‌గా 367 టీ20 మ్యాచ్‌లు ఆడిన వార్నర్ 100 హాఫ్ సెంచరీలు బాదాడు. కాగా, అంతర్జాతీయ టీ20ల్లో వార్నర్‌కు ఇది 25వ అర్ధ శతకం. ఇక టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు నమోదు చేసిన లిస్ట్‌లో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ (91) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. వెస్టిండీస్ మాజీ క్రికెటర్ క్రిస్ గేల్ (88) మూడో ప్లేస్‌లో ఉన్నాడు. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ లిస్ట్‌లో 74 అర్ధ శతకాలతో 8వ స్థానంలో కొనసాగుతున్నాడు.
Aus vs Wi 1st T20 2024:ఈ మ్యాచ్‌లో వార్నర్ 36 బంతుల్లోనే 70 పరుగులు చేశాడు. దీంతో ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 213 పరుగుల భారీ స్కోర్ చేయగలిగింది. ఛేదనలో వెస్టిండీస్ 202 పరగులకే పరిమితమై ఓటమిపాలైంది. ఇక మెరుపు హాఫ్ సెంచరీతో రాణించిన వార్నర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అవార్డు ప్రజెంటేషన్‌లో వార్నర్ టీ20 రిటైర్మెంట్ క్లారిటీ ఇచ్చాడు. 'మ్యాచ్‌లో గెలవడం సంతోషంగా ఉంది. బ్యాటింగ్‌కు ఈ పిచ్ అనుకూలించింది. నేను 2024 టీ20 వరల్డ్‌కప్‌లో ఆడాలనుకుంటున్నా. ఆ తర్వాత పొట్టి ఫార్మాట్ క్రికెట్ నుంచి కూడా తప్పుకుంటా. ఈ 6 నెలలు మేం ఆడాల్సిన సిరీస్‌లు చాలానే ఉన్నాయి. న్యూజిలాండ్‌తో త్వరలో జరగనున్న సిరీస్‌కు కూడా ఇదే జట్టుతో వెళ్తామనుకుంటున్నా' అని వార్నర్ అన్నాడు. ఇక ఈ పర్యటనలో వెస్టిండీస్ ఆసీస్‌కు అసలు పోటీనే ఇవ్వలేకపోతోంది. ఇదివరకే ముగిసిన టెస్టు, వన్డే సిరీస్‌ల్లో దారుణంగా ఓడింది.
-
David Warner won the Player of the match award in his 100th match in Tests, ODI & T20I.
— Johns. (@CricCrazyJohns) February 9, 2024
- The Greatest all-format player of Australia 🫡 pic.twitter.com/Df0zhIC7dR
హాలీవుడ్ రేంజ్లో వార్నర్ ఎంట్రీ- గ్రౌండ్‌లోనే హెలికాప్టర్ ల్యాండింగ్
'గ్రేట్' అనేంతలా వార్నర్ ఏం చేయలేదు' - ఆసీస్ ఓపెనర్‌పై మాజీ కోచ్ కామెంట్స్