ETV Bharat / sports

ప్రాక్టీస్​ సెషన్​లో తప్పిదం - ఫ్యాన్​ ఐఫోన్‌ పగలకొట్టిన చెన్నై క్రికెటర్ - ఆ తర్వాత ఏం చేశాడంటే? - Daryl Mitchell CSK

author img

By ETV Bharat Telugu Team

Published : May 7, 2024, 6:46 PM IST

Daryl Mitchell
Daryl Mitchell (Source : Associated Press)

Darry Mitchell CSK : చెన్నై సూపర్ ప్లేయర్ డారిల్‌ మిచెల్‌ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో భారీ షాట్ కొట్టి ఓ అభిమాని ఫోన్ పగలకొట్టాడు. అయితే ఆ తర్వాత అతడు ఆ ఫ్యాన్​కు ఇచ్చిన గిఫ్ట్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇంతకీ ఏమైందంటే ?

Daryl Mitchell CSK : ధర్మశాల వేదికగా పంజాబ్‌ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే అదే రోజు ఓ ఆసక్తికరమైన ఘటన జరిగింది. మ్యాచ్‌కి ముందు ప్రాక్టీస్ చేస్తున్న చెన్నై జట్టు ప్లేయర్ డారిల్ మిచెల్ అనుకోకుండా ఓ అభిమాని ఫోన్‌ పగులగొట్టాడు. ఇంతకీ ఆ ఘటన ఎలా జరిగిందంటే?

మ్యాచ్‌కి ముందు మిచెల్ ప్రాక్టీస్​ చేస్తున్నాడు. అయితే అదే సమయంలో అతడు ఓ భారీ షాట్ ఆడాడు. ఆ బాల్ కాస్త స్టేడియంలో స్టాండ్స్​ వైపుకు దూసుకెళ్లింది. అక్కడే ఉన్న ఓ ఫ్యాన్​ చేతిలో ఉన్న ఐఫోన్​కు తగిలింది. దీంతో ఆ ఫోన్ విరిగిపోయింది. అయితే ఆ తర్వాత ఈ విషయాన్ని తెలుసుకున్న మిచెల్, ఆ అభిమానికి క్షమాపణలు చెప్పాడు. అంతే కాకుండా తన బ్యాటింగ్ గ్లవ్స్​ను బహుమతిగా ఇచ్చాడు. ఇక ఈ విషయాన్ని ఆ అభిమాని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఇది చూసిన ఫ్యాన్స్ ఓ వైపు ఆ ఫ్యాన్​కు జరిగిన నష్టం గురించి మాట్లాడుకుంటూనే, మరోవైపు మిచెల్ చేసిన పనిని మెచ్చుకుంటున్నారు. అతడి మంచి మనసుకు ఫిదా అవుతున్నారు.

ఇక ఆదివారం జరిగిన మ్యాచ్​లో మిచెల్ 19 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో మొత్తం 30 పరుగులు చేశాడు. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 167/9 స్కోరు చేసింది. రవీంద్ర జడేజా 26 బంతుల్లో 43 పరుగులతో టాప్ స్కోర్ చేశాడు. అనంతరం ఛేజింగ్‌కి దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 139/9 మాత్రమే చేయగలిగింది. జడేజా నాలుగు ఓవర్లలో కేవలం 20 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. చెన్నై ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. 11 మ్యాచ్‌లలో 6 గెలిచి, 5 ఓడిపోయింది. తర్వాత మ్యాచ్‌ మే 10న గుజరాత్ టైటాన్స్‌తో ఆడనుంది.

ధోనీ నెం.9లో ఎందుకు వచ్చాడంటే? - అసలు రీజన్ ఇదే - IPL 2024 CSK

'ధోనీ చేసింది కరెక్ట్ కాదు!'- ఇర్ఫాన్ షాకింగ్ కామెంట్స్ - IPL 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.