CSK vs RCB IPL 2024 : ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్-17లో శుభారంభం చేసింది. శుక్రవారం ఆసక్తికరంగా సాగిన ఈ సీజన్ ఆరంభ పోరులో 6 వికెట్ల తేడాతో గెలిచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై విజయం సాధించింది. ప్లేయర్ ఆప్ ద మ్యాచ్ ముస్తాఫిజుర్ (4/29)కు దక్కింది.
174 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఐపీఎల్ అరంగేట్ర ప్లేయర్ రచిన్ రవీంద్ర 15 బంతుల్లో 3 సిక్స్‌లు, 3 ఫోర్లు సాయంతో 37 పరుగులు ), చివర్లో శివమ్ దూబే (27 బంతుల్లో 34*) విజృంభించి ఆడారు. రవీంద్ర జడేజా (25*), అజింక్యా రహానె(27), డారిల్ మిచెల్(22) పరుగులతో రాణించారు. ఈ సారి కెప్టెన్సీగా బాధ్యతలు చేపట్టిన రుతురాజ్ (15 పరుగులు) నిరాశ పరిచాడు. బెంగళూరు బౌలర్లలో గ్రీన్ రెండు వికెట్లు తీయగా, యశ్ దయాల్, కర్ణ్ శర్మ తలో వికెట్ దక్కించుకున్నారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసి ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. కెప్టెన్ డుప్లెసిస్ (23 బంతుల్లో 8 ఫోర్లు సాయంతో 35), అనుజ్ రావత్ ( 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 48 పరుగులు), దినేశ్ కార్తిక్ (26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 38* పరుగులు) కీలక ఇన్నింగ్స్ ఆడారు. విరాట్ కోహ్లీ (21) పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. అయితే ఓ దశలో 78 పరుగులకే కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లోకి వెళ్లిపోయిన బెంగళూరును అనుజ్, కార్తిక్ జోడీ ఆదుకుంది. ఆరో వికెట్‌కు ఈ ఇద్దరు 95 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
Kohli T20 12 Thousand Runs : ఇకపోతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీ20ల్లో 12,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. 360 ఇన్నింగ్స్‌లో దీన్ని సాధించాడు. అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న రెండో బ్యాటర్‌గా నిలిచాడు.
-
A Winning Start in #TATAIPL 2024 ✅
— IndianPremierLeague (@IPL) March 22, 2024
A Winning Start at home in Chennai ✅
The Defending Champions Chennai Super Kings seal a 6⃣-wicket victory over #RCB 👍 👍
Scorecard ▶️ https://t.co/4j6FaLF15Y #CSKvRCB | @ChennaiIPL pic.twitter.com/DbDUS4MjG8
గ్రాండ్‌గా మొదలైన IPL- చంద్రయాన్ 3కి ఓపెనింగ్ సెర్మనీ అంకితమిచ్చిన BCCI - Ipl 2024 Opening Ceremony
వాళ్ల బ్యాగ్ మోసిన ధోనీ- ఫ్యాన్స్ ఫిదా!- వీడియో వైరల్ - MS Dhoni IPL 2024