CSK Vs PBKS IPL 2024 : వరుసగా నాలుగు ఓటముల తర్వాత కళ్లు చెదిరే బ్యాటింగ్‌తో గత మ్యాచ్‌లో కోల్‌కతాపై సంచలన విజయం సాధించిన పంజాబ్ కింగ్స్ టీమ్ మరోసారి మెరిసింది. ఆల్‌రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్‌కింగ్స్‌కు షాకిచ్చింది. స్పిన్నర్లు బ్రార్, రాహుల్ చాహర్‌ల అద్భుత బౌలింగ్‌తో చెన్నైను స్వల్ప స్కోరుకే పరిమితం చేసిన పంజాబ్ కింగ్స్ బెయిర్‌స్టో, రొసోల మెరుపులతో లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. 7 వికెట్ల తేడాతో గెలిచింది.
చెన్నై ముందుంచిన 163 పరుగుల టార్గెట్‌ను అలవోకగా చేధించేందుకు బరిలోకి దిగారు పంజాబ్ కింగ్స్. తొలుత బ్యాటింగ్‌కు దిగిన జానీ బెయిర్ స్టో(46; 30 బంతుల్లో 7×4, 1×6) దూకుడుగానే ఆడాడు. కానీ అనూహ్యంగా ధోనీకీ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇక తనతో పాటు క్రీజులో ఉన్న ప్రభమన్ సింగ్ 13 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత వచ్చిన రీలీ రొసో (43; 23 బంతుల్లో 5×4, 2×6) తన పరుగులతో జట్టుకు మంచి స్కోర్ అందించాడు. కానీ 43 పరుగులకే ఔట్ అయ్యాడు. ఇక చివరి 8 ఓవర్లలో పంజాబ్‌కు 50 పరుగులు అవసరమైన సందర్భంలో క్రీజులోకి వచ్చిన శశాంక్ సింగ్ (25 నాటౌట్; 26 బంతుల్లో 1×4, 1×6), సామ్ కరన్(26 నాటౌట్; 20 బంతుల్లో 3×4) భారీ షాట్లు ఆడకపోయినా ఎక్కువగా సింగిల్సే తీసుకుంటూ జట్టును ముందుకు నడిపించారు. ఈ జంట నాలుగో వికెట్‌కు 50 పరుగులు నమోదు చేసింది. చెన్నై కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఒత్తిడి తేవడానికి ప్రయత్నించినా కుదరలేదు. అలా 17.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ 0.2-0-4-0; శార్దూల్ 3.4-0-48-1; గ్లీసన్ 3.5-0-30-1; ముస్తాఫిజుర్ 4-1-22-0; జడేజా 3-0-22-0; మొయీన్ 2-0-22-0; దూబె 1-0-14-1 వికెట్లు తీశారు. కాగా, చెన్నై పేసర్ దీపక్ చాహర్ తొడకండరాల గాయం కారణంగా కేవలం రెండు బంతులే వేసి మైదానాన్ని వీడాడు.
అంతకుముందు తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై జట్టు అంతగా రాణించలేకపోయింది. పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు సంధించడం వల్ల చెన్నై జట్టు స్వల్ప లక్ష్యాన్ని ముందుంచగలిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు మాత్రమే చేసింది. చెన్నై జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (62) మంచి ఇన్నింగ్స్ ఆడి జట్టును తన స్కోర్‌తో ఆదుకున్నాడు. ఆ తర్వాత బరిలోకి దిగిన అజింక్య రహానె (29), సమీర్ రిజ్వీ (21), మొయిన్ అలీ (15) కూడా తమ ఆటతీరుతో ఫర్వాలేదనిపించారు. ఇక ఆఖర్లో బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీ (14) మంచి ఫామ్‌లో ఉన్నాడు అని అనుకున్న సమయంలో ఇన్నింగ్స్ చివరి బంతికి రనౌటయ్యాడు. ఈ సీజన్‌లో ధోనీ ఇలా ఔట్ కావడం ఇదే తొలిసారి. పంజాబ్ బౌలర్లలో రబాడ 4-0-23-1; అర్ష్‌దీప్ 4-0-52-1; సామ్ కరన్ 3-0-37-0; హర్‌ప్రీత్ 4-0-17-2; రాహుల్ చాహర్ 4-0-16-2; హర్షల్ 1-0-12-0 వికెట్లు తీశారు.
చెన్నై తుది జట్టు : రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), డారిల్ మిచెల్, అజింక్య రహానె, మొయిన్ అలీ, శివమ్ దూబె, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, రిచర్డ్ గ్లీసన్, ముస్తాఫిజుర్ రెహ్మన్.
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌లు : సమీర్ రిజ్వీ, ముకేశ్ చౌదరి, సిమర్‌జిత్ సింగ్, షేక్ రషీద్, ప్రశాంత్ సోలంకి.
పంజాబ్ కింగ్స్ తుది జట్టు : సామ్ కరన్ (కెప్టెన్), రిలీ రోసోవ్, జానీ బెయిర్‌స్టో, శశాంక్ సింగ్, జితేశ్ శర్మ, అషుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్.
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌లు : ప్రభ్‌సిమ్రన్ సింగ్, లియామ్ లివింగ్‌స్టోన్, రిషి ధావన్, విద్వత్ కావేరప్ప, హర్‌ప్రీత్ సింగ్ భాటియా.
పంజాబ్ రికార్డ్ ఛేజింగ్ - ఉత్కంఠ పోరులో కోల్‌కతాపై విజయం - IPL 2024 PBKS VS KKR
థ్రిల్లింగ్ మ్యాచ్‌లకు కేరాఫ్ అడ్రస్- ఎంటర్టైన్మెంట్లో 'పంజాబ్' తగ్గేదేలే - IPL 2024