Cricketers With Highest Debut Wickets : స్కాట్లాండ్ స్టార్ పేసర్ చార్లీ కాసెల్ తన అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించాడు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ వన్డే డెబ్యూ మ్యాచ్‌ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్లు గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఫిడేల్ ఎడ్వర్డ్స్
వెస్టిండీస్ పేసర్ ఫిడెల్ ఎడ్వర్డ్స్ 2003 నవంబరులో జింబాబ్వేపై జరిగిన మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో 22 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. వర్షం కారణంగా 45 ఓవర్లకు కుదించిన మ్యాచ్ లో విండీస్ జట్టు 256 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాటర్ వేవెల్ హిండ్స్ 127 పరుగులు చేశాడు. ఆ తర్వాత బాల్ అందుకున్న ఫిడెల్ ఎడ్వర్డ్స్ జింబాబ్వే జట్టు 72 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసేలా చేశాడు.
కగిసో రబాడ
2015లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన రబాడ, తన తొలి వన్డే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 6/16 గణాంకాలను నమోదు చేశాడు. రబాడ విజృంభణతో ఈ మ్యాచ్‌లో బంగ్లా జట్టు 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ లక్ష్యాన్ని ప్రొటీస్ జట్టు బ్యాటర్లు అలవోకగా ఛేదించారు.
టోనీ డోడెమైడ్
1998లో ఆస్ట్రేలియా పేసర్ టోనీ డోడెమైడ్ తన అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. పెర్త్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 21 పరుగులిచ్చి ఐదు వికెట్లను తీశాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లలో డేవిడ్ బూన్ (56), డీన్ జోన్స్ (55) అదరగొట్టడం వల్ల 249 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంకకు డోడెమైడ్ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. క్రమం తప్పకుండా వికెట్లు తీసిన ఈ పేసర్ శ్రీలంకను 168 పరుగులకు అలౌట్ అయ్యేలా చేశాడు.
జాన్ ఫ్రైలింక్
నమీబియాకు చెందిన పేసర్ జాన్ ఫ్రైలింక్ తన డెబ్యూ మ్యాచ్‌లోనే ఒమన్ జట్టును హడలెత్తించాడు. 13 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. దీంతో నమీబియా 145 పరుగుల తేడాతో ఈ మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.
డెబ్యూ మ్యాచ్‌లోనే 7 వికెట్లు - రబాడా రికార్డు బ్రేక్ చేసిన స్కాట్లాండ్ పేసర్
వరల్డ్ కప్ హిస్టరీలో టాప్ - 5 వికెట్ టేకర్స్ వీరే! - T20 World Cup 2024