ETV Bharat / sports

ఖరీదైన బ్యాట్​లు వాడుతున్న క్రికెటర్లు- ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! - Expensive Cricket Bats - EXPENSIVE CRICKET BATS

Expensive Bats Used By Cricketers : క్రికెట్​ ప్లేయర్లు వాడే బ్యాట్ ధర ఎంత ఉంటుందో తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. మరి ప్రపంచ క్రికెట్​లో అత్యంత ఖరీదైన బ్యాట్​లు వాడే క్రికెటర్లు ఎవరో తెలుసా?

Expensive Cricket Bats
Expensive Cricket Bats (Source: Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Sep 16, 2024, 1:08 PM IST

Expensive Bats Used By Cricketers : ప్రపంచవ్యాప్తంగా క్రికెట్​కు ఉండే క్రేజే వేరు. క్రికెటర్లకు సంబంధించిన ఏ విషయాన్నైనా అభిమానులు ఆసక్తిగా తెలుసుకుంటారు. ఈ క్రమంలో అత్యంత ఖరీదైన బ్యాట్​లను వాడిన క్రికెటర్లు ఎవరు? అత్యంత ధర ఉన్న క్రికెట్ బ్యాట్​ను వాడిన బ్యాటర్ ఎవరు? తదితర విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

  • వివియన్ రిచర్డ్స్ : విండీస్ క్రికెట్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ ప్రపంచంలోని అత్యంత ఖరీదైన బ్యాట్ ఉపయోగించాడు. ఈ దిగ్గజ ఆటగాడు ది గ్రే నికోల్స్ లెజెండ్ గోల్డ్ బ్రాండ్ బ్యాట్ (Gray Nicolls Legend Bat) వాడాడు. ఇంగ్లీష్​ విల్లో కలపతో తయారుచేసిన ఈ బ్యాట్ ధర ఏకంగా 14 వేల డాలర్లు. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.11.74 లక్షలు.
  • స్టీవ్ స్మిత్ : ఆస్ట్రేలియా టాప్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ కూడా ఖరీదైన బ్యాట్ ను వాడుతున్నాడు. స్మిత్ వాడుతున్న ఎన్ బీ (న్యూ బ్యాలెన్స్) అనే బ్యాట్‌ ధర రూ.11 లక్షలు.
  • హార్దిక్ పాండ్య : టీమ్ఇండియా హార్డ్​ హిట్టర్, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య సుసుంపన్నమైన క్రికెటర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు. పాండ్యకు విలాసవంతమైన కార్లు, బంగ్లా ఉన్నాయి. అంతేకాకుండా పాండ్య వాడే బ్యాట్ కూడా ఖరీదైనదే. ఈ ఆల్​రౌండర్ వాడే ఎస్ జీ (SG) బ్యాట్ ధర రూ.1,79.999.
  • క్రిస్ గేల్ : వెస్టిండీస్ దిగ్గజం, సిక్సర్ల వీరుడు క్రిస్ గేల్ స్పార్టన్ బ్రాండ్ బ్యాట్ (Spartan Cricket Kit) ఉపయోగిస్తాడు. దీంతో బంతిని సునాయాశంగా బౌండరీలకు తరలిస్తాడు. ఈ బ్యాట్ ధర రూ. ఒక లక్ష.
  • జాస్ బట్లర్ : ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జాస్ బట్లర్ కూడా ఖరీదైన బ్యాట్‌ ఉపయోగిస్తున్నాడు. అతడు వాడే కుకబురా (Kookaburra) బ్యాట్ ధర అక్షరాల రూ.97 వేలు.
  • డేవిడ్ వార్నర్ : ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ డీఎస్ సీ (Delux Sports Company) బ్యాట్ ఉపయోగిస్తాడు. దీని ధర రూ.95 వేలు.
  • బెన్ స్టోక్స్ : ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ జీఎం (Gun And More) బ్యాట్​తో మైదానంలోకి దిగుతాడు. దాని ధర రూ.95 వేలు.
  • సూర్య కుమార్ యాదవ్ : టీమ్ఇండియా విధ్వంసకర ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ ఎస్ఎస్ (Sareen Sports) బ్యాట్ వాడుతున్నాడు. దాని ధర రూ.92 వేలు.
  • గార్డెనర్ : ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ గార్డెనర్ రూ.91 వేల విలువైన బ్యాట్ ఉపయోగిస్తోంది.
  • కేన్ విలియమ్సన్ : న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ రూ.83వేల విలువైన బ్యాట్ వాడుతున్నాడు.
  • విరాట్ కోహ్లీ : టీమ్ఇండియా రన్ మెషీన్, కింగ్ విరాట్ కోహ్లీ ఉపయోగించే బ్యాట్ ఎంఆర్ఎఫ్ (MRF). దీని ధర రూ.77 వేలు.

టై మ్యాచ్​లో పాక్​ను చిత్తు చేసిన భారత్ - ధోనీ శకం మొదలైంది అప్పుడే! - 2007 India Vs Pakistan Bowl Out

మరణించిన 15 ఏళ్ల తర్వాత టెస్టుల్లో అరంగేట్రం చేసిన క్రికెటర్! - అదెలా సాధ్యమైందంటే? - TEST DEBUT AFTER15 YEARS DEATH

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.