ETV Bharat / sports

పాలిటిక్స్‌లో స్టార్ క్రికెటర్లు - గంభీర్, బజ్జీ కాకుండా లిస్ట్‌లో ఎవరెవరున్నారంటే? - Cricketers In Politics

author img

By ETV Bharat Sports Team

Published : Sep 6, 2024, 5:00 PM IST

Cricketers Turned Politicians : క్రికెటర్ల నుంచి రాజకీయ నాయకులుగా మారిన టీమ్‌ఇండియా ప్లేయర్లు ఎవరో తెలుసా?

Cricketers Turned Politicians
Cricketers Turned Politicians (Cricketers Turned Politicians)

Cricketers Turned Politicians : దేశంలో క్రికెట్‌కు ఉండే క్రేజే వేరు. అందుకే క్రికెటర్లకు అభిమానులు నిరాజనం పడుతుంటారు. అయితే చాలా మంది దిగ్గజ క్రికెటర్లు మైదానంలోనే కాదు, రాజకీయల్లోనూ రాణించారు. వారెవరో? ఏ పార్టీ తరఫున పోటీ చేశారు? ప్రస్తుతం ఏ పదవిలో ఉన్నారు? తదితర విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

1. గౌతమ్ గంభీర్
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాక స్టార్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ రాజకీయాల్లోకి వెళ్లారు. భారతీయ జనతా పార్టీలో (బీజేపీ)లో ఆయన 2019లో చేరారు. అదే ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తూర్పు దిల్లీ నియోజకవర్గం ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం టీమ్‌ఇండియా హెచ్ కోచ్‌గా ఉన్నారు.

2. హర్భజన్ సింగ్
టీమ్‌ఇండియా మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ అంటే తెలియనివారుండరు. బజ్జీ చాలా మ్యాచ్‌ల్లో టీమ్‌ఇండియాకు విజయాలను అందించారు. అలాగే రాజకీయాల్లోనూ రాణించారు. 2022లో ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నారు.

3. నవజ్యోత్ సింగ్ సిద్ధూ
భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కూడా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఆయన తొలుత బీజేపీలో జాయిన్ అయ్యారు. ఆ పార్టీ తరఫున 2004, 2009లో అమృత్ సర్ నుంచి ఎంపీగా రెండు సార్లు విజయం సాధించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు.

4. మహ్మద్ కైఫ్
టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత మహ్మద్ కైఫ్ కూడా రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫుల్‌పుర్‌ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

5. ఎస్ శ్రీశాంత్
టీమ్ఇండియా మాజీ పేసర్ ఎస్ శ్రీశాంత్ కూడా రాజకీయ రంగప్రవేశం చేశారు. ఐపీఎల్‌లో ఫిక్సింగ్ ఆరోపణలతో అతడి క్రెకిట్ కెరీర్ అర్థాంతరంగా ముగిసిపోయింది. అయితే 2016లో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

6. మహ్మద్ అజారుద్దీన్
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ కూడా రాజకీయాల్లో రాణించారు. 2009లో మొరాదాబాద్ నుంచి కాంగ్రెస్ టికెట్‌ పై పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2014 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.

7. కీర్తి ఆజాద్
భారత మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ కూడా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. తన తండ్రి, బిహార్ మాజీ సీఎం భగవత్ ఝా ఆజాద్ వారసత్వాన్ని పునికిపుచ్చుకున్నారు. భారతీయ జనతా పార్టీ తరపున దర్భంగా స్థానం నుంచి పోటీ చేసి మూడుసార్లు ఎంపీ అయ్యారు. ఆ తర్వాత 2019లో కాంగ్రెస్‌ టికెట్‌ పై ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం తృణముల్‌ కాంగ్రెస్‌లో (TMC) ఉన్నారు.

8. చేతన్ శర్మ
భారత మాజీ పేసర్, టీమ్‌ఇండియా చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ కూడా రాజకీయాల్లోకి వెళ్లారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ (BSP) తరఫున ఫరీదాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు.

9. మనోజ్ తివారీ
భారత మాజీ ప్లేయర్ మనోజ్ తివారీ రాజకీయాల్లో రాణించారు. 2021లో జరిగిన బంగాల్ శాసనసభ ఎన్నికల్లో టీఎంసీ తరఫున శిబ్ పుర్ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం మనోజ్ బంగాల్ క్రీడా మంత్రిగా ఉన్నారు.

10. వినోద్ కాంబ్లీ
టీమ్ఇండియా మాజీ ఓపెనర్ వినోద్ కాంబ్లీ కూడా రాజకీయల్లోకి వచ్చారు. 2009లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో లోక్‌ భారతి పార్టీ టిక్కెట్‌పై పోటీ చేసి ఆయన ఓటమిపాలయ్యారు.

ఫాదర్ ఆఫ్ సౌత్​ ఇండియన్ క్రికెట్​ ఎవరో తెలుసా? - Buchi Babu Cricket Tournament

ఫ్యాబ్‌ 5లో ఎక్కువ సార్లు డకౌట్‌ అయిన ప్లేయర్ ఎవరో తెలుసా? - Most Ducks In International Cricket

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.