Cricketers Family Members In Other Professions : క్రికెట్లో ఎంతో మంది స్టార్స్ తమ సత్తా చాటుతూ మైదానంలో రాణించారు. మైదానంలో వాళ్ల ఆటతీరుతో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తుంటారు. అయితే వీళ్లను ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎంతో మంది ఈ క్రీడలోకి వచ్చిన వారు ఉన్నారు. అందులో తమ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు. ఉదాహరణకు హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య , మహ్మద్ షమీ- మహ్మద్ కైఫ్, ఇలా చాలా మంది క్రికెటర్లు రికార్డులు సృష్టిస్తున్నారు. అయితే కొంతమంది క్రికెటర్ల కుటుంబ సభ్యులు ఇతర క్రీడల్లో రాణిస్తున్నారు. వారేవరో తెలుసుకుందాం.
దీపికా పల్లికల్ల్ :
టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ దినేశ్ కార్తిక్ సతీమణి దీపికా పల్లికల్ ఓ ప్రొఫెషనల్ స్క్వాష్ ప్లేయర్. 2014 కామన్వెల్త్ గేమ్స్‌లోనూ ఆమె బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. అంతేకాకుండా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్ 10లోకి అడుగుపెట్టిన మొదటి భారతీయ మహిళ స్క్వాష్ క్రీడాకారిణిగా రికార్డు క్రియేట్ చేశారు.
శీతల్ గౌతమ్ :
టీమ్ఇండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప ఫ్యామిలీలో ఓ టెన్నిస్ ప్లేయర్ ఉన్నారు. ఆయన సతీమణి శీతల్ గౌతమ్ కూడా ఫ్రొఫషన్ ప్లేయరే. 2000 నుంచి ఈ క్రీడ్లో రాణించిన శీతల్ 2013లో రిటైర్మెంట్ ప్రకటించారు.
బ్రాండన్ స్టార్క్ :
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మిచెల్ స్టార్క్ సోదరుడు బ్రాండన్ స్టార్క్ ఓ ప్రోఫషనల్ అథ్లెట్. అతడు హై జంప్ క్రీడలో రాణిస్తున్నాడు.
వనిందు హసరంగ :
శ్రీలంక స్టార్ క్రికెటర్ చామిక కరుణరత్నే సోదరుడు వనిందు హసరంగ ప్రస్తుతం అదే జట్టులో ఆల్ రౌండర్‌గా రాణిస్తున్నాడు.
క్రిస్ బ్రాడ్ :
ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ స్టువర్ట్ బ్రాడ్ తండ్రి క్రిస్ బ్రాడ్ కూడా ప్రోఫషనల్ క్రికెటర్. ఆయన డెర్బీషైర్, ఇంగ్లాండ్ జట్లకు ప్రాతినిథ్యం వహించారు. ఇక స్టువర్ట్ తల్లి మౌరీన్ బ్రాడ్ కూడా ప్రొఫెషనల్ హాకీ క్రీడాకారిణి. లాస్ ఏంజెల్స్‌లో జరిగిన 1984 సమ్మర్ ఒలింపిక్స్‌లో ఆమె ఇంగ్లాండ్‌కు ప్రాతినిధ్యం వహించారు.
ఇక్రాముల్లా ఖాన్
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ తండ్రి ఇక్రాముల్లా ఖాన్, 1950లలో పాకిస్తాన్ తరపున ప్రొఫెషనల్ క్రికెట్ ఆడారు. ఇక ఇమ్రాన్ సోదరుడు అమీర్ ఖాన్ ప్రొఫెషనల్ స్క్వాష్ ఆటగాడు. అతను 1986, 1990 కామన్వెల్త్ గేమ్స్‌లో పాకిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించారు.
రాజకీయాల్లో క్రికెటర్ల మార్క్- MP టూ PM వరకు- అక్కడా కూడా ఈ స్టార్లదే హవా!