ETV Bharat / sports

102 డిగ్రీల జ్వరంతో శార్దూల్ బ్యాటింగ్ - హై ఫీవర్​లోనూ 36 రన్స్​! - Shardul Thakur Irani Cup

Shardul Thakur 102 Degrees Fever : 2024 ఇరానీ కప్​లో ఆడుతున్న యంగ్ ఆల్​రౌండర్ శార్దూల్ ఠాకూర్ అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో అతడిని హాస్పిటల్​లో జాయిన్ చేశారు.

Shardul Thakur Fever
Shardul Thakur Fever (Source: Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : Oct 3, 2024, 10:42 AM IST

Shardul Thakur 102 Degrees Fever : టీమ్ఇండియా యంగ్ ప్లేయర్ శార్దూల్ ఠాకూర్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. 2024 ఇరానీ కప్​ టోర్నీలో ఆడుతున్న శార్దుల్ హై ఫీవర్​తో బాధపడుతున్నప్పటికీ బ్యాటింగ్​కు దిగాడు. దీంతో జ్వరం ఎక్కువ కావడం వల్ల మ్యాచ్ అనంతరం శార్దూల్​ను లఖ్​నవూలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం శార్దూల్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు.

ఇరానీ కప్​లో భాగంగా ముంబయి- రెస్ట్ ఆఫ్ ఇండియా మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్​లో రెండో రోజు (బుధవారం) ముంబయి ఆటగాడు శార్దూల్ రోజంతా నీరసంగానే కనిపించాడు. అయినప్పటికీ శార్దూల్ బ్యాటింగ్ చేయడానికి క్రీజులో దిగాడు. 102 డిగ్రీల జ్వరంతో బాధపడుతూనే బ్యాటింగ్ కొనసాగించాడు. 59 బంతులు ఎదుర్కొని 36 పరుగులతో రాణించాడు. ఇక ఇన్నింగ్స్​ ముగిసిన తర్వాత జ్వరం మరింత పెరగడం వల్ల ముంబయి మేనేజ్​మెంట్ శార్దూల్​ను హాస్పిటల్​లో జాయిన్ చేసింది.

శార్దూల్​కు డెంగీ, మలేరియా వంటి పరీక్షలు నిర్వహించారు. టెస్టులకు సంబంధించిన రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ఆ రిపోర్టులు వచ్చిన తర్వాత మూడో రోజు అతడిని ఆడించాలా? లేదా? అన్నదానిపై నిర్ణయం తీసుకుంటామని ముంబయి జట్టు వర్గాలు పేర్కొన్నాయి.

డిశ్ఛార్జీ
'శార్దూల్ ఠాకూర్ హాస్పిటల్ నుంచి డిశ్ఛార్జీ అయ్యాడు. ఇవాళ అతడు బరిలోకి దిగడం లేదు. అతడు హై ఫీవర్​తో బాధపడుతున్నాడు'అని ముంబయి క్రికెట్ అసోసియేషన్ అధికారి ఒకరు ఈటీవీ భారత్​తో చెప్పారు. దీంతో ఈ మ్యాచ్​లో మూడోరోజు శార్దూల్ బరిలో దిగలేదు.

కాగా, తొలి ఇన్నింగ్స్​లో ముంబయి భారీ స్కోర్ సాధించింది. 537 పరుగులకు ఆలౌటైంది. యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. అతడు 222 పరుగులు నమోదు చేశాడు. ఇక కెప్టెన్ అజింక్యా రహానే (97 పరుగులు), శ్రేయస్ అయ్యర్ (57 పరుగులు), తనుశ్ కొటియాన్ (64 పరుగులు) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్లలో ముకేశ్ కుమార్ 5 వికెట్లు పడగొట్టాడు. యశ్ దయాల్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో 2, జైన్ 1 వికెట్ దక్కించుకున్నారు.

సర్ఫరాజ్‌ ఖాన్ 'డబుల్' ట్రీట్​ - ఇరానీ కప్​లో ద్వీశతకంలో అదుర్స్​ - Irani Cup 2024

బంగ్లాపై సిరీస్​ క్లీన్​ స్వీప్​- WTC ఫైనల్‌కు చేరాలంటే టీమ్ఇండియా ఎన్ని మ్యాచ్‌లు గెలవాలంటే? - WTC 2025 Team India

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.