ETV Bharat / sports

ధోనీ ఫ్యాన్స్​కు షాక్​- CSK కెప్టెన్​గా రుతురాజ్ - Chennai Super Kings New Captain

Chennai Super Kings New Captain : 2024 ఐపీఎల్​లో కీలక పరిణామం జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్​ కెప్టెన్​గా యంగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ ఎంపికయ్యాడు. గత 16 సీజన్​లుగా కెప్టెన్​గా వ్యవహరించిన ధోనీకి వయసు రిత్యా ఆ బాధ్యతల నుంచి తప్పించి రుకతురాజ్​కు అప్పగించినట్లు తెలుస్తోంది.

Chennai Super Kings New Captain
Chennai Super Kings New Captain
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 21, 2024, 4:02 PM IST

Updated : Mar 21, 2024, 4:43 PM IST

Chennai Super Kings New Captain: 2024 ఐపీఎల్​లో కీలక పరిణామం జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్​ కెప్టెన్​గా యంగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అఫీషియల్​గా డిక్లేర్ చేసింది. ఇక ట్రోఫీతో కెప్టెన్​ల ఫొటోషూట్​లోనూ చెన్నై తరఫున రుతురాజ్ పాల్గొన్నాడు. ఇక ప్రస్తుత సీజన్​ నుంచి చెన్నై జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వం వహించనున్నాడు.

గత 16 సీజన్​లుగా కెప్టెన్​గా వ్యవహరించిన ధోనీ తన ఇష్టపూర్వకంగానే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. 2008- 2023 మధ్య కాలంలో సీఎస్కేను ముందుండి నడిపిన ధోనీ జట్టును పదిసార్లు ఫైనల్​కు తీసుకెళ్లాడు. అందులో చెన్నైని 5సార్లు ఛాంపియన్​గా నిలిపాడు. ఐపీఎల్​లో 212 మ్యాచ్​లకు కెప్టెన్​గా వ్యవహరించిన ధోనీ 128 సార్లు విజయం సాధించగా, 82 మ్యాచ్​ల్లో ఓడాడు.

అప్పుడే హింట్ ఇచ్చాడు: అయితే 2024 ఐపీఎల్ నేపథ్యంలో ధోనీ ఇటీవల ఓ ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, 'న్యూ సీజన్ , న్యూ రోల్' అని క్యాప్షన్ రాసుకొచ్చాడు. దీంతో ధోనీ ఆటకు గుడ్​బై చెప్పి చెన్నైకి మెంటార్​గానో లేదా కోచ్​గానో చేరనున్నాడంటూ అప్పట్లో ప్రచారం సాగింది. కానీ తాజా పరిణామంతో క్లారిటీ వచ్చేసింది. ఇక ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి తొలిసారి ధోనీ కెప్టెన్​గా కాకుండా కేవలం బ్యాటర్​గా బరిలోకి దిగనున్నాడు.

చెన్నైతో రుతురాజ్ జర్నీ: యంగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ 2019లో చెన్నై జట్టులో చేరాడు. కెరీర్​ ప్రారంభంలో రెండు సీజన్​లలో బరిలో దిగే ఛాన్స్ రాలేదు. కానీ, 2021 నుంచి రుతురాజ్ తనదైన మార్క్ చూపించాడు. ఆ సీజన్​లో 16 మ్యాచ్​ల్లో గైక్వాడ్ 635 పరుగులతో సత్తా చాటాడు. ఆ తర్వాత వరుసగా 2022లో 368 పరుగులు, 2023లో 590 పరుగులతో కీలక ప్లేయర్​గా ఎదిగాడు. ఇక 2023లో చైనాలో జరిగిన ఆసియా క్రీడల్లో టీమ్ఇండియా (సెకండ్ గ్రేడ్ జట్టు)కు రుతురాజ్ కెప్టెన్​గా వ్యవహరించాడు. కాగా, మార్చి 22న చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్​తో సీజన్​ 17కు తెరలేవనుంది.

చెన్నై సిక్సర్ కొట్టేనా? - జట్టు బలాబలాలు ఇవే! - IPL 2024 CSK

ఐపీఎల్‌లో అత్యధిక పరుగుల వీరులు- కానీ సెంచరీ మార్క్ అందుకోలేదు

Last Updated : Mar 21, 2024, 4:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.