Cameron Green Covid: క్రికెట్లో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఆస్ట్రేలియా జట్టు మరోసారి వార్తల్లో నిలిచింది. గబ్బా వేదికాగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఓ సంఘటన ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు జాతీయ గీతం పాడే సమయంలో ఆసీస్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్, లైన్లో తన సహచర ప్లేయర్లకు కాస్త డిస్టెన్స్‌లో నిలబడ్డాడు. అయితే గ్రీన్‌కు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావడం వల్ల అతడు దూరంగా నిలబడ్డాడు. దీంతో ఆసీస్ జట్టును సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. 'కొవిడ్ ఉందని తెలిసినప్పుడు ఆడించడం ఎందుకు? ఆడిస్తే ఇలా దూరంగా నిలబెట్టడం ఎందుకు?' అని ప్రశ్నిస్తున్నారు.
అయితే గ్రీన్‌తోపాటు ఆసీస్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌కు కూడా రీసెంట్గా కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. వీళ్లు ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టుతో కాకుండా సపరేట్గా ఉంటున్నట్లు బోర్డు తెలిపింది. 'కామెరూన్ గ్రీన్, ఆండ్రూ మెక్‌డొనాల్డ్ జట్టుకు దూరంగా ఉంటున్నారు. వారికి కొవిడ్ నెగిటివ్ నిర్ధరణ అయ్యేదాకా అలాగే సపరేట్గా ఉంటారు. గ్రీన్ కొవిడ్ నిబంధనల మేరకే బరిలోకి దిగుతున్నాడు' అని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.
-
Cameron Green, who has tested positive for COVID-19, is giving some space to his Australian mates. Feeling bad for him 😞 #AUSvsWI pic.twitter.com/R4UvGtvYVW
— Farid Khan (@_FaridKhan) January 25, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">Cameron Green, who has tested positive for COVID-19, is giving some space to his Australian mates. Feeling bad for him 😞 #AUSvsWI pic.twitter.com/R4UvGtvYVW
— Farid Khan (@_FaridKhan) January 25, 2024Cameron Green, who has tested positive for COVID-19, is giving some space to his Australian mates. Feeling bad for him 😞 #AUSvsWI pic.twitter.com/R4UvGtvYVW
— Farid Khan (@_FaridKhan) January 25, 2024
West Indies tour of Australia 2024: వెస్టిండీస్ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఈ టూర్లో విండీస్ ఆతిథ్య జట్టులో రెండు టెస్టు, మూడు వన్డే, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ క్రమంలో తొలి టెస్టులో ఆసీస్ 10 వికెట్ల తేడాతో నెగ్గింది. కాగా, ఇరుజట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ గురువారం (జననరి 25) ప్రారంభమైంది.
ఆస్ట్రేలియా జట్టు: ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, కామెరూన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ (కెప్టెన్), నథన్ లిన్, జోష్ హేజిల్‌వుడ్.
వెస్టిండీస్ జట్టు: క్రాగీ బ్రాత్‌వైట్ (కెప్టెన్), తాగ్నరైన్ చందర్‌పాల్, క్రిక్ కెంజీ, అలిక్ అథనాజ్, హోడ్జ్, జస్టిన్ గ్రేవ్స్, జోషువా డి సిల్వా, అల్జారీ జోసేఫ్, కెవిన్ సింక్లెర్, షమర్ జోసేఫ్, కెమర్ రోచ్
ఫీల్డింగ్ మేళవింపుల్లో కొత్త ప్రయోగాలు - ఇదే టెస్ట్ క్రికెట్ నయా సక్సెస్ మంత్ర!
వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్ ఔట్- ఆంధ్ర కుర్రోడికి ఛాన్స్ దక్కేనా?