Bumrah on Dhoni, Virat Kohli, Rohit Sharma Captaincy : టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పదునైన బంతులతోనే కాదు హాస్య చతురతతో కూడా అభిమానులను ఆకట్టుకుంటుంటాడు. అయితే తాజాగా అతడిని 'మీకు ఇష్టమైన కెప్టెన్ ఎవరు' అని ఓ యాంకర్ ప్రశ్నించగా తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చాడు బుమ్రా. దీంతో పాటే టీమ్ ఇండియా దిగ్గజ కెప్టెన్లుగా పేరు గాంచిన మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనీ, రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీలపై తన అభిప్రాయాలను చెప్పాడు.
దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలో జట్టులోకి వచ్చి అద్భుతాలు చేశాడు జస్ప్రీత్ బుమ్రా. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో బౌలింగ్‌కు మరింత మెరుగులు దిద్దుకోవడంతో పాటు ఆట పట్ల మక్కువ పెంచుకున్నాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఎంతో స్వేచ్ఛగా ఆడాడు. దీంతో ఈ ముగ్గురిలో మీ ఉత్తమ కెప్టెన్ ఎవరు అని యాంకర్ బుమ్రాను ప్రశ్నించాడు. దీనికి బుమ్రా చాలా తెలివిగా సమాధానం ఇచ్చాడు. " టీమిండియాలో చాలామంది గొప్ప కెప్టెన్లు ఉన్నారు. అయితే అందులో నా పేరు కూడా ఉండాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నేనే నా అభిమాన కెప్టెన్ మరి" అని బుమ్రా పేర్కొన్నాడు.
రోహిత్ బాగా అర్థం చేసుకుంటాడు - బుమ్రా తన కెరీర్ ఎదుగుదలలో ధోనీ, కోహ్లీ, రోహిత్ ఎలా సహకరించారో ఇలా చెప్పుకొచ్చాడు. "బ్యాటర్‌గా ఉన్నా బౌలర్ల పట్ల సానుభూతి చూపే అతికొద్ది మంది కెప్టెన్‌లలో రోహిత్ ఒకడు. అతడు ఆటగాళ్ల భావోద్వేగాలను అర్థం చేసుకుంటాడు. ఏ బౌలర్ ఏం చేయగలడో రోహిత్‌కు తెలుసు. రోహిత్ కఠినంగా ఉండడు. ఏదైనా చెప్తే వింటాడు" అని బుమ్రా అన్నాడు.
ధోనీ దాన్ని పెద్దగా నమ్మడు - "ఎంఎస్ ధోనీ జట్టులో నా స్థానంపై భరోసా కల్పించాడు. నాపై మహీకి చాలా నమ్మకం ఉంది. నా అంతర్జాతీయ కెరీర్లో ఎదగడానికి తోడ్పడ్డాడు. అతడు ఎక్కువగా ప్రణాళికలు రచించడాన్ని నమ్మడు." అని బుమ్రా చెప్పుకొచ్చాడు.
దానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడు - కెప్టెన్‌గా కోహ్లీ ప్రస్థానంపైనా బుమ్రా స్పందించాడు. "కోహ్లీ ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు. మేము కూడా అలానే ఉండేలా ప్రోత్సహిస్తాడు. ఇప్పుడు విరాట్ కెప్టెన్ కాదు, కానీ ఇప్పటికీ నాయకుడిగానే ఉన్నాడు. కెప్టెన్సీ ఒక పోస్ట్ మాత్రమే. జట్టును 11 మంది నడుపుతున్నారు." అని బుమ్రా వెల్లడించాడు.
కాగా, టీమిండియా తరఫున బుమ్రా తన కెరీర్లో కేవలం 36 టెస్టులు మాత్రమే ఆడాడు. వన్డేలు, టీ 20 మ్యాచుల్లో అయితే ఇంకా వంద మ్యాచ్‌ల మార్కును కూడా తాకలేదు. 89 వన్డేలు, 70 టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు.
'పంజాబ్ కింగ్స్'లో విభేదాలు - అతడిపై ప్రీతీ జింటా లీగల్ యాక్షన్ - Punjab Kings Preity Zinta